హైదరాబాద్

నత్తనడకన మెట్రో పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, ఏప్రిల్ 17: దిల్‌సుఖ్‌నగర్‌లో మెట్రో పనుల నేపథ్యంలో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఎటుచూసినా వాహనాలు భారీ నిలుపుదలతో దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు మండే ఎండ, ట్రాఫిక్ జామ్ తోడవ్వటంతో వాహన చోదకులు ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మెట్రోపనులు నత్తనడకన సాగుతున్నాయి. మెట్రో పనుల నేపథ్యంలో రోడ్డు కుదించుకు పోయింది.
రోడ్డును ఆక్రమిస్తున్న వ్యాపార సంస్థలు
మిరుమిట్లు గొలిపే వ్యాపార సంస్థలకు ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కొరవడింది. దీంతో వారు ప్రధాన రహదారిపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఒక పక్క మెట్రోపనులతో సగం రోడ్డు కుదించుకుపోయింది. మరోపక్క ఉన్న అరకొర రోడ్డును వ్యాపార సముదాయాలు అక్రమ పార్కింగ్‌తో అక్రమిస్తున్నాయి. మిగిలిన ఆ కొంచెమైనా ప్రయాణానికి సజావుగా ఉందా...అంటే అదీ లేదు. అంతా గుంతల మయంతో దర్శనమిస్తోంది. గతితప్పిన రోడ్లపై ప్రయాణించాలంటేనే యముడితో సాహవాసం చేసినంత పనవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ పార్కింగ్ పై దృష్టి సారించని పోలీసులు
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారంటూ నిత్యం వాహనదారులను చాలాన్లతో పీడించే ట్రాఫిక్ పోలీసులకు అక్రమ పార్కింగ్ కనబడటంలేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, జీబ్రా క్రాసింగ్ దాటడం, స్వల్ప పని నిమిత్తం ప్రధాన రహదారి పక్కన గల పాదచారుల దారిలో నిలిపిన వాహనాలను తమ కెమెరాల ద్వారా ఫొటోలు తీసి మరీ చలాన్లు విధించే పోలీసులు అక్రమ పార్కింగ్‌పై ఎందుకు కొరడా ఝళిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వ్యాపార సంస్థల వారు నిత్యం వీరికి పెద్దమొత్తంలో మామూళ్లు సమర్పించడం వల్లే వీరు వాటిని చూసీచూడనట్టు వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.