హైదరాబాద్

తిరుమలగిరి రోడ్డులో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: తిరుమలగిరి-నేరేడ్‌మెట్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. నగరశివారులోని హైదర్‌నగర్‌కు చెందిన కారు (నెంబర్ ఎపి29ఏ 4830) తిరుమలగిరి నుంచి నేరేడ్‌మెట్ వైపు వెళుతోంది. తిరుమలగిరి శివారులోని మిలటరీ ఏరియా వైపు నుంచి వస్తున్న ఓ బైక్ కారును ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు తిరుమలగిరి ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.