హైదరాబాద్

వామ్మో.. ఈవీఎంలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ప్రజలు, వివిధ రాజకీయ వర్గాల్లో అనేక రకాలు అపోహలు నెలకొన్న నేపథ్యంలో అవి అధికారులను కూడా ఒకింత భయపెడుతున్నాయి. దేశంలోనే అత్యున్నతమైన హోదాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు సైతం వీటికి భయపడటం గమనార్హం. కొద్దిరోజుల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని ఈవీఎంలలో జరిగిన పలు లోపాలు, అవకతవకలకు బాధ్యుడిని చేస్తూ కలెక్టర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం ఏకంగా సస్పెన్షన్ వేటు వేసిన నేపథ్యంలో ఈవీఎంల వ్యవహారమంటేనే ఏమి జరుగుతుందోననంటూ అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశమున్నందున ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లను ప్రారంభించింది. నగరంలోని చుడీబజార్, చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో భద్రపరిచిన ఈవీఎంలను ఫస్ట్ లెవెల్ చెకింగ్ (ఎఫ్‌ఎల్‌సీ) ప్రక్రియను చేపట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కోర్టు కేసులన్న పలు నియోజకవర్గాల మినహా మిగిలిన నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్ (బీఈఎల్) ఇంజనీర్లు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతల సమక్షంలో తనిఖీలు చేస్తున్నారు. నమూనా ఓట్లను వేసి మాక్ పోలింగ్ నిర్వహించి, వాటిని లెక్కించటం, ఇప్పటికే నిక్షిప్తమై ఉన్న పాత ఓట్లను పూర్తిగా తొలగించటం, ఈవీఎంల సీల్ కంట్రోలింగ్ యూనిట్‌ను పింక్ పేపర్‌తో సీల్ చేయటం వంటివి చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా తొలుత ఈవీఎంలను భద్రపరిచిన గదిలోకి వెళ్లేందుకు వివరాలను నమోదు చేయటం, సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలేసి వెళ్లటం మొదలుకుని వివిధ స్థాయిలో జరిగే తనిఖీల ప్రక్రియ ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్ విధానంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా పర్యవేక్షిస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత ప్రక్రియ మొత్తం సజావుగా, సాఫీగా, పారదర్శకంగా జరిగిందని నిర్దారిస్తూ ఇవ్వాల్సిన నివేదికలపై అదనపు కమిషనర్ (ఎన్నికలు), ఈవీఎం ఫస్ట్ లెవెల్ చెకింగ్ పర్యవేక్షకులుగా నియమితులైన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఈ నివేదికలపై సంతకాలు పెడితే వికారాబాద్ జిల్లా కలెక్టర్ మాదిరిగా తామకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోననే భయంతో సంతకాలు పెట్టడం లేదని తెలిసింది. దీంతో ఎన్నికల విభాగానికి చెందిన వారి కింది స్థాయి అధికారులు టార్గెట్‌కు తగిన విధంగా ఈవీఎంలను తనిఖీ చేయకపోవటం, చేసిన తనిఖీలను నిర్దారిస్తూ నివేదికలు రూపొందించటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం శనివారం కమిషనర్ దాన కిషోర్ దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. ఇద్దరు ముఖ్యమైన ఐఏఎస్ అధికారులను పిలిపించి తమ చాంబర్‌లో పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. ఈవీఎంల తనిఖీల్లో జరిగే వివిధ ప్రక్రియలకు సంబంధించి నిర్దారించేందుకు ఏ ప్రక్రియకు ఎవరు సంతకాలు పెట్టాలనే అయోమయం ఉండేదని, కమిషనర్ చర్చించిన తర్వాత స్పష్టత వచ్చిందని ఎన్నికల విభాగానికి చెందిన ఓ అధికారి చెప్పారు.