హైదరాబాద్

తెలంగాణ సాహిత్యయోధుడు ఆచార్య రామారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఏప్రిల్ 17: తెలంగాణ సాహిత్య యోధుడు ఆచార్య బి.రామారాజు అని తెలంగాణ రచయిత వేదిక అధ్యక్షుడు జయధీర్ తిరుమల్‌రావు అన్నారు. తెలంగాణ సాహిత్యయోధుడు, జానపద సాహిత్యవేత్త ఆచార్య బి.రామారాజు సాహిత్యం-
జీవితం-పరిశోధన అంశంపై తెలంగాణ రచయిత వేదిక ఆధ్వర్యంలో ఆదివారం బాగ్‌లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జయధీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ సమాజంలో ఎంతో మంది సాహిత్యయోధులు ఉన్నారని, కేవలం కొంతమందికి మాత్రమే గౌరవం దక్కుతుందని తెలిపారు. సాహిత్య రంగల్లో తెలంగాణకు రామారాజు చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
సాహిత్య రంగంలోనే కాకుండా జానపదంలోకూడా పరిశోధనలు చేసి విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య చరిత్రను ఎంతో పరిశోధన చేసి తవ్వి తీశారని తెలిపారు. జానపద సాహిత్యంలో ఆయన చేసిన రచనలు మళ్లీ ముద్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ అధ్యక్షుడు రవ్వాశ్రీహరి, ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్, జానపద విజ్ఞానవేత్త డా.కె.విద్యావతి, ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ, ప్రముఖ కవి డా.నాళేశ్వరం శంకరం, ప్రముఖ రచయిత తెలిదేకార భానుమూర్తి, ప్రముఖ కవి గాజుల శ్రీ్ధర్, జానపద పరిశోధకుడు డా.బూక్కా బాలస్వామి, తెలుగు విశ్వవిద్యాలయం అధ్యాపకుడు డా.రత్నశ్రీ పాల్గొన్నారు.