హైదరాబాద్

కేసీఆర్ మంత్రివర్గంలో తలసానికి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సజావుగా స్వపరిపాలన, అభివృద్ధిని చేపడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నగరం నుంచి మరొకరికి స్థానం దక్కింది.
ఇప్పటికే కేసీఆర్ మంత్రివర్గంలో నగరానికి చెందిన మహమూద్ అలీ హోం మంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే! గత ప్రభుత్వంలో కేసీఆర్ కేబినేట్‌లో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్యవహారించిన తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా నేడు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నందున సనత్‌నగర్ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మంగళవారం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్న తొమ్మిది మంది మంత్రుల్లో తలసానికి స్థానం దక్కినట్లు, ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ప్రగతి భవన్‌కు పిలిపించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కానీ రెండోసారి ఏర్పాటవుతున్న కేసీఆర్ కేబినెట్‌లో ఎక్కువ మంది కొత్తవారికి అవకాశమిచ్చినా, నగరం నుంచి మాత్రం తలసానికి మరోసారి అవకాశమివ్వటం విశేషం. ముందస్తు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు లభిస్తుంది? ఈ సారి కొత్తగా గెలిచిన వారికెవరికైనా అవకాశం దక్కవచ్చునన్న అంశాలపై ఎన్నో ఊహాగనాలు విన్పించాయి. కొత్తగా గెలిచిన వారికి కేసీఆర్ అవకాశమిస్తారా? లేక గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహారించిన తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావులకే మళ్లీ ఛాన్స్ దక్కుతుందా? అన్న ఉత్కంఠకు సోమవారం తెర పడింది. కానీ తలసాని కన్నా పద్మారావు సీఎం కేసీఆర్‌కు చాలా సన్నిహితుడని, ఈ సారి తలసానికి స్థానం దక్కకపోవచ్చునని, ఎవరికి స్థానం దక్కినా, దక్కకపోయి, పద్మారావుకు బెర్త్ ఖాయమంటూ విన్పించిన వాదనలు ‘తల’కిందులయ్యాయి. రాజకీయంగా దశాబ్దాలుగా అనుభవం కలిగిన దానం నాగేందర్, ముఠాగోపాల్, జి.సాయన్న, పద్మారావు వంటి బడా నాయకులు గెలిచిన నేపథ్యంలో మంత్రి వర్గం ఎవరికి దక్కవచ్చునన్నది ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే! కానీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒక సంచలనాన్ని సృష్టించే కేసీఆర్ అన్ని రకాల ఊహాగనాలు, పుకార్లకు చెక్ పెడుతూ వ్యూహాత్మంగా తలసానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ చేసిన ఘాటైన వ్యాఖ్యలు, అందుకు ఏపీ మంత్రుల నుంచి వచ్చిన స్పందనకు ధీటుగా సమాధానం చెప్పటంలో తలసాని తనదైన శైలిని పోషించి, సీఎంను ఆకట్టుకున్నారా? విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే నేతగా ఆకర్షించుకున్నారా? అన్న వాదనలు సైతం లేకపోలేవు. ఏదీ ఏమైనా గత ప్రభుత్వంలో నగరం నుంచి నాయిని, మహమూద్ అలీ, పద్మారావు, తలసాని మంత్రులుగా వ్యవహారించినా, ఈ సారి ఇద్దరికి అవకాశమివ్వటంలో కేసీఆర్ వ్యూహాం ఏమిటీ? అన్న సరికొత్త చర్చ తెరపైకొచ్చింది.