హైదరాబాద్

పచ్చదనమే..పచ్చదనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేసేందుకు నగరాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ సిద్దమైంది. ప్రస్తుతమున్న పార్కులు గాక, నగరంలో కొత్తగా మరో 25 హరితహారం థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. మరో 25 థీమ్ పార్కులను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కొద్దిరోజుల క్రితం స్థారుూ సంఘం ఆమోదించిన నేపథ్యంలో నగరంలో ఐదు ఎకరాలకు పై బడిన ఖాళీ స్థలాను గుర్తించే పనిలో అధికారులున్నారు. ఈ మేరకు జోనల్ కమిషనర్లకు కమిషనర్ దాన కిషోర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇందులో భాగంగా సోమవారం కమిషనర్ దాన కిషోర్, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఇతర ఉన్నతాధికారులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. ముఖ్యంగా రోడ్ నెం. 11 నుంచి రోడ్ నెం. 36వరకు కమిషనర్ పర్యటించి, అక్కడున్న ఖాళీ స్థలాలు, పార్కుల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి జోన్ పరిధిలో కనీసం ఐదు పార్కులను ఏర్పాటు చేయాలని, ఇందుకు స్థలాలను గుర్తిచి, ప్రతిపాదనలు పంపాలని జోనల్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ పార్కులను హరితహారం పార్కులుగా వ్యవహారించనున్నట్లు కమిషనర్ తెలిరు.
ఊపందుకున్న మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులు
పాతబస్తీ వాసులకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు బల్దియా చేపట్టిన మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులు మరింత ఊపందుకున్నాయి.