హైదరాబాద్

40రోజులు...రూ.524 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బల్దియాకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను కలెక్షన్‌ను పెంచుకునే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఏటా చెల్లించాల్సిన ఆస్తిపన్నును చెల్లించేందుకు బకాయిదారులు ముందుకొస్తున్నా, కొన్ని సమస్యలు ఎదురవుతుండటంతో వాటిని పరిష్కరించేందుకు బల్దియా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గత సంవత్సరం మాదిరిగా ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో పన్ను వసూళ్లను పెంచుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే! వర్తమాన ఆర్థిక సంవత్సరం రూ.1500 కోట్ల కలెక్షన్‌ను లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.976 కోట్లు వసూలు కాగా, మిగిలిన రూ.524 కోట్ల వసూలు చేసుకోవాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా కేవలం 40రోజులు మాత్రమే ఉండటంతో, ఈ 40రోజుల్లో దాదాపు రూ. 524 కోట్ల పన్ను వసూలు చేసుకోవాలన్న లక్ష్యంగా బల్దియా ఉంది. ఈ సంవత్సరం చేసిన వసూళ్లను గత సంవత్సరం ఇదే తేదీ నాటికి గమనిస్తే రూ. 45 కోట్లు అదనంగా వసూలు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరంలో చేసిన మొత్తం కలెక్షన్ కన్నా ఈసారి కనీసం రూ. వంద కోట్లు పన్ను వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ఉన్నారు. ఆస్తిపన్ను ఏ మాత్రం పెంచకుండా, వసూళ్లలో అంతర్గతంగా ఉన్న లొసుగులను సరి చేసుకుంటూ, అసెస్‌మెంట్ పరిధిలోకి రాని ఆస్తులను ఆస్తిపన్ను పరిధిలోకి తీసుకురావటం వంటి చర్యలను చేపట్టిన వసూళ్లను పెంచుకోవాలని బల్దియా భావిస్తోంది. ఇందుకుగాను ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెలాఖరు వరకు అన్ని సర్కిళ్లలో ప్రతి ఆదివారాల్లో ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కమిషనర్ దాన కిషోర్ తెలిపారు.
ప్రతి సర్కిల్‌లో మూడు కౌంటర్లు: కమిషనర్
ఆస్తిపన్ను సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రతి సర్కిల్ కార్యాలయంలో ప్రతి ఆదివారం మూడు కౌంటర్లను ఏర్పాటు చేస్తామని కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. ముఖ్యంగా ఇందులో ఆస్తిపన్ను రివిజన్‌కు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆస్తిపన్నుకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులు, కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ రకంగా ఇప్పటివరకు ఆస్తిపన్ను సంబంధించి కోర్టుల్లో 86 కేసులున్నాయని, హైకోర్టులో 74 కేసులున్నట్లు తెలిపారు. ఈ ‘ప్రాపర్టీట్యాక్స్ పరిష్కారం’ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి ఇంజనీరింగ్, యూసీడీ, ట్యాక్స్ విభాగం, శానిటేషన్‌కు చెందిన అన్ని స్థాయిల సిబ్బంది ఎన్నికలు, స్వచ్ఛ కార్యక్రమాల నిర్వాహణలో ఉన్నందున పన్నుల సేకరణ ఆశించిన మేరకు జరగటం లేదని, రానున్న 40రోజుల్లో ట్యాక్సు కలెక్షన్‌ను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు.