హైదరాబాద్

కొప్పులకు ‘సంక్షేమం’ పట్ల హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమ శాఖను కేటాయించటం పట్ల తెలంగాణ మాల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ విలేఖర్లతో మాట్లాడుతూ సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్‌కు కేటాయించినందుకు సీఎం కెసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ప్రభుత్వం సంక్షేమ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా మంత్రిని నియమించకపోవటం పట్ల ఎస్సీ,ఎస్టీ, బీసీ, బడుగు,బలహీనవర్గాల సమస్యలు ఆశించిన స్థాయిలో పరిష్కారం కాలేదని వాపోయారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, బడుగు వర్గాలకు న్యాయం చేస్తూ, వారిని కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకోవటం గొప్ప విషయమే అయినా, ఎన్నో సమస్యాలు పరిష్కారం కాలేదని వాపోయారు. దళిత, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలతో సత్సంబంధాలున్న కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమ శాఖను కేటాయించినందున దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో ఎస్సీ,ఎస్టీల సమస్యలు, అట్రాసిటీ కేసులు పరిష్కారానికి నోచుకునే అవకాశముందని బత్తుల రాంప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో త్వరలోనే అభినందన సభ నిర్వహించి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఘనంగా సత్కరించనున్నట్లు రాంప్రసాద్ తెలిపారు.