హైదరాబాద్

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: విశ్వ ఉత్తర ఆర్ట్ ఫౌండేషన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘కూచిపూడి’ నృత్య ప్రదర్శన మంగళవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి గానసభ అధ్యక్షుడు కళా జానర్దన మూర్తి, డా.జయప్రద రాంమూర్తి పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. ఎస్‌ఎస్‌కే నృత్యాలయ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

విద్యార్థులు కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్
కాచిగూడ, ఫిబ్రవరి 19: విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగేశ్వరి అన్నారు. పటేల్‌గూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై విద్యను బోధించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.
పర్యావరణ పరిరక్షణకు ఎకో ట్యాంక్ ప్రింటర్స్
కాచిగూడ, ఫిబ్రవరి 19: పర్యావరణ పరిరక్షణకు ఎకో ట్యాంక్ ప్రింటర్లు ఎంతో ఉపయోగపడతాయని ఇన్క్ ప్రింటర్స్ ఎప్సన్ ఇండియా జనరల్ మేనేజర్ శివకుమార్ పత్రికా ప్రకటనలో తెలిపారు. డిజిటల్ ప్రింటింగ్‌లో అగ్రగామియైన ఎప్సన్ సరికొత్త మోనోక్రోమ్ ఎకో ట్యాంక్ ప్రింటర్స్‌ను మూడు వెరైటీలను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు వివరించారు. వినియోగదారులకు తక్కువ ఖర్చుతో విద్యుత్ పొదుపు చేయవచ్చని అన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రింటర్లను రూపొందించినట్లు తెలిపారు. 19 సంవత్సరాలుగా గృహ అవసరాలు, వ్యాపార సంస్థలకు తగ్గట్టుగా ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించాలి
కాచిగూడ, ఫిబ్రవరి 19: తెలంగాణ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, ధాత్రి సంక్షేమ సంఘం, ధాత్రి కళాంజలి సంయుక్త ఆధ్వర్యంలో ‘1950 నుండి తెలంగాణ కవులు వెలువరించిన నృత్య గేయ రూపకాలు, వాటి తీరుతెన్నులు’ అంశంపై రెండు రోజుల సదస్సు మంగళవారం రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. తెలంగాణ నృత్య గేయ రూపకాలు పేరిట కొత్త అంశాన్ని తీసుకురావడం అభినందనీయమని అన్నారు.