హైదరాబాద్

సమాజానికి స్ఫూర్తి.. బదిర విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: బధిర విద్యార్థులు తమ వైకల్యాన్ని అధిగమించి చదువులో రాణించి సమాజానికి స్ఫూర్తితో పాటు సందేశాన్ని ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్.జగదీశ్వర్ అన్నారు. హియరింగ్ హ్యాండ్‌క్యాప్‌డ్ రెసిడెన్షియల్ స్కూల్ గోల్డెన్ జ్లూబీ వేడుకలు బుధవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగదీశ్వర్ విచ్చేసి మాట్లాడుతూ వినికిడి లోపం ఉన్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అవయవ లోపం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సామర్థ్యం కలిగి ఉంటుందని తెలిపారు. శిశు దశలోనే వినికిడి లోపాన్ని గుర్తించి శస్త్ర చికిత్స చేయడంతో నివారించవచ్చని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహయ, సహకారం చేయాడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బధిర విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ బీ.శైలజ, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి గోగులోతు, స్కూల్ ప్రిన్సిపల్ అరుణ, సెక్రటరీ శ్రీహరి పాల్గొన్నారు.
ఆప్పీ ఫిజ్ ప్రచారకర్తగా జూనియర్ ఎన్‌టీఆర్
కాచిగూడ, ఫిబ్రవరి 20: దక్షిణ భారతదేశంలో పార్లే అగ్రో మార్కెటింగ్‌లో టాలీవుడ్ నటుడు జూ. ఎన్‌టీఆర్ యాప్పీ ఫిజ్ ప్రచారకర్తగా ఒప్పందం జరిగిందని పార్లే అగ్రోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ నాడియా చౌహన్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ సినిమాలపై ప్రేక్షకులు నటులపై చూపించే ప్రజాదరణ భారతదేశంలో ఎక్కువగా ఉందని తెలిపారు. శీతల పానీయాల కంపెనీలో ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఒప్పందం జరిగిందని అన్నారు. ప్రస్తుతం 99శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా కొనసాగుతున్న యాప్పీ ఫిజ్ బ్రాండ్‌ను సరికొత్తగా, దక్షిణాది రాష్ట్రాల్లోని వినియోగదారులకు తాజాగా అందిస్తామని వివరించారు.