హైదరాబాద్

‘మహిళలకు మళ్లీ మొండిచేయి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఏర్పాటులో మళ్లీ మహిళలకు మొండి చేయి చూపారని నగర తెలుగుదేశం అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు విమర్శించారు. బుధవారం సిటీ టీడీపీ ఆఫీసులో విలేఖర్లతో ఎంఎన్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత 68 రోజుల సుదర్ఘీ నిరీక్షణ తర్వాత కేసీఆర్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినా, మహిళలకు అసంతృప్తే మిగిలిందని వాపోయారు. జనాభాలో యాభై శాతం మంది మహిళలు ఉన్నా, అధికార పార్టీలోనే మంచి రాజకీయ అనుభవం కలిగిన మహిళా ప్రజాప్రతినిధులున్నా, వారికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవటం.. కేసీఆర్‌కు మహిళల పట్ల ఉన్న చిన్నచూపు, చులకన భావనే కారణమని అన్నారు. గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపిన ప్రభుత్వం.. గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. జనాభాలో యాభై శాతం బలహీనవర్గాల ప్రజలున్నా, వారికి ప్రాముఖ్యత లేని శాఖలు కేటాయించారని ఆరోపించారు. జనాభాలో పది శాతం ఉన్న ఒకే వర్గానికి చెంది, కొత్తగా మొదటిసారి శాసనసభకు ఎన్నికైనవారికి మంత్రి పదవులు కేటాయించి అగ్రవర్ణాలకు పెద్దపీట వేసిందని వివరించారు. ఒకవైపు మహిళలు, బలహీనవర్గాలు, గిరిజనులను కించపరిచే విధంగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని, సీనియర్ మంత్రులకు ప్రాముఖ్యత లేని శాఖల బాధ్యతలను అప్పగించి, మంత్రిగా అనుభవం లేని, మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి కీలక శాఖలను కట్టబెట్టారని విమర్శించారు. మహిళలు, బలహీనవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులకు వెంటనే మంత్రివర్గంలో చోటు కల్పించాలని సూచించారు. సమావేశంలో టీడీపీ నేతలు వనం రమేశ్, బజరంగ్ శర్మ, బద్రినాథ్ యాదవ్, ప్రదీప్ చౌదరి, షకీలారెడ్డి, నెల్లల్ల కిషోర్, కప్ప కృష్ణాగౌడ్, మహిళా నేతలు ఝాన్సీ, ప్రమీలా, అన్నపూర్ణ, శాంతి ఉన్నారు.