హైదరాబాద్

ఎన్నికలు.. వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల కబ్జాల పరంపర ఏ మాత్రం ఆగటం లేదు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు ఎంత ఆధునిక విధానాలను అవలంభించినా, క్షేత్ర స్థాయి అధికారుల విధి నిర్వాహణ లోపం, రాజకీయాల ప్రమేయంతో చివరకు వినాయకుడ్ని నిమజ్జనం చేయాల్సిన కొలను, ప్రగతినగర్ ఎఫ్‌టీఎల్‌ను వ్యాపారులు ఆక్రమించుకోవటంతో కబ్జాల పాలైంది. బుధవారం కమిషనర్ దాన కిషోర్ మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధికి చేపట్టిన పనులను తనిఖీ చేస్తుండగా, బయటపడింది. బాధ్యులైన అధికారులపై కమిషనర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనిఖీల్లో భాగంగా కూకట్‌పల్లి ప్రగతినగర్ చెరువులో జీహెచ్‌ఎంసీ నిర్మించిన గణేష్ నిమజ్జన కొలనులో ఎవరికి వారు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈరకంగా గణేష్ నిమజ్జన కొలనును కబ్జా చేసినా, మీకు కన్పించటం లేదా.. అసలు మీరేం డ్యూటీ చేస్తున్నారని సంబంధిత అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కొలను పూర్తిగా ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు, వ్యర్థాలతో నిండి ఉంటాన్ని గమనించిన కమిషనర్.. లక్షలాది రూపాయలు వెచ్చించి కొలనులను నిర్మించిన తర్వాత వాటికెందుకు కనీస నిర్వాహణను చేపట్టడం లేదని అధికారులను ప్రశ్నించారు.
మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలి
* అభివృద్ధి పనులపై డెడ్‌లైన్
చెరువులను రక్షించి, అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనులను మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు గడువును కమిషనర్ దాన కిషోర్ విధించారు. బుధవారం ఆయన నగరంలోని పలు చెరువుల అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూకట్‌పల్లి జోన్‌లోని గంగారం, పెద్దచెరువుల అభివృద్ధి సుందరీకరణ పనులను నేరుగా పరిశీలించారు. చెరువుల్లో డ్రైనేజీ నీరు కలవకుండా, వాటిని మళ్లించేందుకు కాలువలను నిర్మించటం, సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, చెరువు కట్టల ఎత్తు పెంచటం వంటి పనులను మే నెల చివరి కల్లా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో రూ. 282.50 కోట్ల వ్యయంతో 19 చెరువుల పరిరక్షణ, సుందరీకరణ పనులను చేపట్టామని, వీటిలో 12 చెరువుల పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. వర్షాకాలంలోపు చెరువు కట్టలను పటిష్టం చేయటం, చెరువుల్లో డ్రైనేజీ నీరు కలవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనులన్నింటినీ మే నెల చివరి కల్లా పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక కార్యచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గంగారం పెద్ద చెరువును రూ. 19 కోట్లు, మియాపూర్ పటేల్ చెరువును రూ.12.50 కోట్లతో, ప్రగతినగర్ చెరువును రూ.25.34 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రగతి నగర్ చెరువులో నిర్మించిన గణేష్ నిమజ్జనం కొలను పూర్తిగా ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలతో నిండి ఉండటాన్ని గమనించిన కమిషనర్ ఈ సందర్భంగా సంబంధిత అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేశారు.