హైదరాబాద్

మృత్యువుతో పోరాడి గెలిచిన మధులిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మధులిక బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ప్రేమించడం లేదనే అక్కసుతో ఉన్మాదిగా భరత్ మారి కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో మధులికపై విచక్షణ రహితంగా దాడి చేసిన విషయం విదితమే. దాడిలో తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన మధులిక దాదాపు 15 రోజుల తర్వాత కోలుకుంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని, ప్రాణాపాయం లేదని లోపలి గాయాలు తగ్గడానికి మరికొన్ని రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రాణాలతో బయటపడటమే కష్టమనుకున్న తమ కూతురి ప్రాణాలు కాపాడిన వైద్యులకు మధులిక తల్లిదండ్రులు కృతజ్ఞతలను తెలిపారు. మధులిక మాట్లాడుతూ తనకిదో పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. తనలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకుండా భరత్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేసింది.