హైదరాబాద్

సిటీ ఓటర్లు 4162215

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : హైదరాబాద్ నగరంలోని 15 అసెంబ్లీ స్థానాలతో కూడిన రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సికిందరాబాద్ కంటోనె్మంట్ నియోజకవర్గాల తుది ఓటరు జాబితాను జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. నగరంలో హైదరాబాద్, సికిందరాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, కంటోనె్మంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 4162215 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. కొద్దిరోజులుగా చేస్తున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గత నెల 22న ఓటరు తుది జాబితా ముసాయిదాను ప్రకటించిన అధికారులు శుక్రవారం తుది జాబితాను ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోని మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం కలిపి 1959490 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. అందులో మహిళలు 945429 మంది ఉన్నట్లు, పురుషులు 1013825 మంది, థర్డ్ జెండర్‌కు చెందిన ఓటర్లు 236 మంది ఉన్నట్లు అధికారులు జాబితాలో పేర్కొన్నారు. సికిందరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికిందరాబాద్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1954513 మంది ఓటర్లు ఉన్నట్లు, అందులో మహిళా ఓటర్లు 915713 మంది, పురుష ఓటర్లు 1015942 మంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో థర్డ్ జెండర్ ఓటర్లు 158 మంది ఉన్నట్లు ప్రకటించారు. కంటోనె్మంట్ నియోజకవర్గంతో కలుపుకుని మొత్తం థర్డ్ జండర్ ఓటర్ల సంఖ్యను 402గా తేల్చారు. నగరంలో అత్యధికంగా 352815 మంది ఓటర్లు జూబ్లీహిల్స్‌లో, అన్నింటికన్నా తక్కువగా 204729 మంది చార్మినార్ నియోజకవర్గంలో ఓటర్లున్నట్లు తుది జాబితాలో వెల్లడించారు.