హైదరాబాద్

550 చదరపు గజాల ప్లాట్‌కు ప్లాన్ ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరంలో సొంతింటిని నిర్మించుకోవాలనుకునే వారికి భవన నిర్మాణ అనుమతులపై అనేక సందేహాలున్నాయి. వీటిని నివృత్తి చేసి, మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా ఈజీగా పర్మిషన్లు తీసుకునేందుకు వీలుగా దరఖాస్తుదారుల్లో అవగాహనను పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ శనివారం ప్రధాన కార్యాలయంలో ‘ఇల్లు-నిర్మాణ సందేహాలు’ పేరుతో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించనుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న ఈ సదస్సు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది. గరిష్టంగా 550 గజాల్లోపు స్థలంలో నిర్మించనున్న ఇళ్ల కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ప్లాన్‌ను కూడా అందుబాటులో ఉంచనుంది. నిర్మాణ అనుమతులు తీసుకునేందుకు అమలు చేస్తున్న నియమ నిబంధనలు, దరఖాస్తును దాఖలు చేసే తీరు, అందుకు అవసరమైన డాక్యుమెంట్లు, ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులకు అనుమతి, ఆ అనుమతి కోసం ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి, అందుకు ఎంత ఫీజు చెల్లించాలన్న అంశాలకు సంబంధించి దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేసి, వారిలో అవగాహనను పెంచి, వారే నేరుగా ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకునేలా ఈ సదస్సుకు దోహదపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు. నిర్మాణ అనుమతి కోరే దరఖాస్తుదారుడు ఏ విధమైన డాక్యుమెంట్లు సమర్పించాలి, ఎంత వరకు సెట్‌బ్యాక్‌లు వంటి అంశాలకు సంబంధించి సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు ఈ సదస్సును ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు.