హైదరాబాద్

అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమ్మిళ అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అని బీసీ కమీషన్ సభ్యులు డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రేపటి అవసరాలు, అభివృద్ధి వికాసాలకు చుక్కాని ఈ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. బడ్జెట్‌కు సీఎం కేసీఆర్ ధృడదీక్ష, కార్యసాధన, దార్శినికత తోడు కావటంతో ఈ బడ్జెట్ మంచి ఫలితాలిస్తోందని పేర్కొన్నారు. తాత్కాలిక బడ్జెటే అయినప్పటికీ నిధుల కేటాయింపుల ప్రతిపాదనల్లో గతంలో ఎపుడూ లేని విధంగా సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్ ఉందని అన్నారు. స్పష్టమైన భవిష్యత్ దర్శనం, కొత్త వ్యూహాంతో అభివృద్ధి ఫలాలు అందిరికీ అందించేలా ప్రభుత్వం రచించిన సమగ్ర కార్యచరణకు ప్రతీక బడ్జెట్ అని అన్నారు.

స్ట్రీట్ వెండర్స్ జీవనోపాధికీ భద్రత కల్పించాలి
హైదరామాద్, ఫిబ్రవరి 22: స్ట్రీట్ వెండర్స్ జీవనోపాధికీ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ అండ్ హాకర్స్ ట్రెడ్ యూనియన్ అధ్యక్షుడు ఎస్.వెంకట్ మోహన్ డిమాండ్ చేశారు. రోడ్లకు ఇరువైపుల ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్స్‌కు చట్టం ప్రకారం కలిగే సదుపాయాలను కల్పించి ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర మెప్మా కృషి చేయాలని కోరారు. వీధి వ్యాపారులకు శిక్షణ శిబిరాలంటూ కాలయాపన చేయడం సరైంది కాదని వెంకట్ మోహన్ మండిపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా అంబర్‌పేట్ శివంరోడ్డులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కేంద్రంలో వీధి వ్యాపారులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి నగరంలోని స్ట్రీట్ వెండర్స్ కొంతమంది మాత్రమే హాజరయ్యారని ఆరోపించారు. రెక్కడితే గాని డోక్కడాని నిరుపేద వీధి వ్యాపారులకు ఇలాంటి శిక్షణ శిబిరాలు ఎంతవరకు ఉపయోగపడుతాయని వెంకట్ మోహన్ ప్రశ్నించారు. వీధి వ్యాపారులకు చట్టపరంగా అందాల్సిన వాటి విషయంలో అధికారులు కాలయాపన చేస్తూ తెంలగాణ మెప్మా లేని కార్యక్రమాలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటుందని ఆరోపించారు. వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన వాటిని అమలు చేయకుండా సంబందిత అధికారులు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ మెప్మా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు తక్షణమే స్పంధించి తగిన చర్యలు తీసుకుని వీధి వ్యాపారులకు మేలు కలిగేలా చూడాలని వెంకట్ మోహన్ విజ్ఞప్తి చేశారు. శివంరోడ్డులోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి విచ్చేసిన వీధి వ్యాపారులను వెంకట్ మోహన్ కలిసి వివరాలు తెలుసుకున్నారు.