హైదరాబాద్

మోదీ ప్రభుత్వంలోనే రైల్వే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : రైల్వేల ఆధునీకరణ ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన వసతుల కల్పనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కాచిగూడ - మిర్యాలగూడ డెమో రైలును నడికుడి వరకు పొడిగిస్తూ.. శనివారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో డెమో రైలును ప్రారంభించారు. పేద ప్రజలకు తక్కువ చార్జీలతో రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి 2019 బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి రూ.1654 కోట్లు కేటాయించిందని, ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తయితే ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం మరో రూ.100కోట్లు కేటాయించి పనులు త్వరిగతిన పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు. సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్, విద్యానగర్ రైల్వే స్టేషన్‌లకు మరింత ఆధునీకరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ డిఆర్‌ఎం అరుణ్ కుమార్ జైన్, ఏడీఆర్‌ఎం సాయి ప్రసాద్, శ్రీనివాస్‌రాజు, సీనియర్ డీసీఎం విక్రమాదిత్య, కాచిగూడ స్టేషన్ డైరెక్టర్ పుష్పరాజ్, స్టేషన్ మేనేజర్ రవీందర్ పాల్గొన్నారు.