హైదరాబాద్

అరచేతిలోనే అప్లికేషన్ స్టేటస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : భవన నిర్మాణ అనుమతుల జారీలో పారదర్శకతను మరింత పెంచేందుకు జీహెచ్‌ఎంసీ సిద్దమైంది. ఇప్పటికే పూణే నగర పాలక సంస్థ తరహాలో ఆన్‌లైన్‌లో అనుమతులిచ్చేందుకు డీపీఎంఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినా,కొంత వరకు ఇబ్బందులు వస్తున్నందన ప్రజలకు నిర్మాణ అనుమతులపై అవగాహన పెంపొందించేందుకు సిద్దమైంది. దీంతో పాటు భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు సమర్పణ మొదలుకుని అనుమతుల ప్రొసీడింగ్ తీసుకునే వరకు మొత్తం ప్రక్రియలను దరఖాస్తుదారుడు ఎప్పటికపుడు తన అప్లికేషన్ స్టేటస్ తెల్సుకునేందుకు, అధికారులు సూచించే లోపాలను సరిచేసుకునేందుకు, వారడిగిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసేందుకు వీలుగా రూపకల్పన చేసిన ప్రత్యేక మొబైల్ యాప్ శనివారం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ దాన కిషోర్, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్‌లో దరఖాస్తుదారుడు తన దరఖాస్తు ఫైల్ నెంబరు ఎంట్రీ చేస్తే, ఆ ఫైలు ఏ అధికారి వద్ద ఉంది, దాని స్టేటస్ ఏమిటీ అన్న విషయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. నగరంలో ప్రతి సంవత్సరం 16వేల పై చిలుకు భవన నిర్మాణ అనుమతులను జారీ చేస్తున్నామని తెలిపారు. ఈ యాప్ ప్రజలకు తమ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందిస్తుందని వివరించారు. దీంతో పాటు అనుమతుల స్టేటస్‌ను తెల్సుకునేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా డ్యాష్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్ల తెలిపారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించి ‘ఇల్లు-నిర్మాణ సందేహాలు’ కార్యక్రమం లో టౌన్‌ప్లానర్స్ హైదరాబాద్ విభాగం రూపొందించిన, జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ టెక్నికల్ స్ట్ఫా అసోసియేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన డైరీలను దాన కిషోర్ ఆవిష్కరించారు. టౌన్, కంట్రీ టౌన్‌ప్లానింగ్ డైరెక్టర్ విద్యాధర్, సీసీపీ ఎస్.దేవేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు.