హైదరాబాద్

ఎన్నికల వ్యయంపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయంపై జిల్లా ఎన్నికల విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించింది.అభ్యర్థులను ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు చేసే ప్రయత్నాలను ఎప్పటికపుడు పసిగట్టి అడ్డుకునేందుకు సిద్దమైంది. ఇందుకు గాను అభ్యర్థుల క్షేత్ర స్థాయి ఎన్నికల వ్యయం వంటి అంశాల పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక కమిటీలను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు.
ఎన్నికల ఏర్పాట్లు, అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల ప్రచార వస్తువుల ధరల నిర్ణయం తదితర అంశాలపై సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దరావత్తు రూ. 25వేలు చెల్లించాల్సి ఉంటుందని, ప్రతి రోజు హైదరాబాద్, సికిందరాబాద్ పార్లమెంటు స్థానాల నామినేషన్లను ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇందుకు గాను హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి కలెక్టర్ మాణిక్ రాజ్‌కు, సికిందరాబాద్ స్థానానికి గాను జిల్లా జాయింట్ కలెక్టర్ రవి రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నందు, వారి కార్యాలయాల్లోనే నామినేషన్లు సమర్పించాలని సూచించారు.
ఎన్నికల వ్యయంపై ఏర్పాటు చేసిన గట్టి నిఘాలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలేన్స్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందాలతో పాటు మీడియా మానిటరింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు
హైదరాబాద్ జిల్లాలో ప్రస్తుతం 3976 పోలింగ్ కేంద్రాలుండగా, అదనంగా మరో 19 గానీ మూడింటిని గాని ఏర్పాటు చేసే అంశంపై ఎన్నికల విభాగం కసరత్తు చేస్తోంది. ఇటీవల నూతనంగా మరికొందరు ఓటర్లుగా చేరినందున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1400ల కన్నా ఎక్కువ ఓటర్లుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం అదనంగా 19 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లను కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తే కేవలం మూడు అదనంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.

ఎదుటివారికి సహాయపడాలి
హైదరాబాద్, మార్చి 18: వేసవి సందర్భంగా జంగమ్మెట్‌లోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద చలివేంద్రంను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నిర్వహణ కార్యదర్శి పర్వతాల రాజేందర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో మెలిగి ఎదుటివారికి సహాయపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పీ.సదామనిశంకర్, మధు యాదవ్, ఉదయ్, మున్నా పాల్గొన్నారు.