హైదరాబాద్

అవగాహనతోనే నీటి పొదుపు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజల్లో అవగాహనతోనే మంచినీటిని పొదుపుగా వినియోగించగలమని జలమండలి ఎండీ ఎం.దాన కిషోర్ స్పష్టం చేశారు. నేటి పరిస్థితుల్లో మంచినీటి విషయంలో ప్రజల్లో అవగాహహాన కల్పించేందుకు సెమినార్‌ల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని ఆస్వాధీస్తూ, పర్యావణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా (ఐఈఐ) తెలంగాణ స్టేట్ సెంటర్, జలమండలి ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశే్వశ్వరయ్య భవన్‌లో మంగళవారం నిర్వహించిన ‘మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయ స్థాయి సెమినార్‌ను జలమండలి ఎండీ దాన కిషోర్ ముఖ్యఅతిథిగా విచ్ఛేసి ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. నేటి పరిస్థితుల్లో మంచినీటి విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెమినార్లు నిర్వహించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇప్పటి వరకు 1.5 బిలియన్ దారిద్ర దిగువన ఉన్న ప్రజలు మంచినీరు. పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రేటర్ ప్రజలకు మాత్రం సబ్సిడీపై 12 రూపాయలకు వీటిని అందిస్తామని వివరించారు. ప్రతి నెల జలమండలి పరంగా విద్యుత్ బిల్లు చెల్లింపులకే రూ.85 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇంటింటికీ మంచినీటిని సరఫరా చేస్తే ప్రతిరోజు 20 మిలియన్ గ్యాలన్ల నీటిని వృథా చేస్తున్నారని దాన కిషోర్ వివరించారు. ఇలా ప్రతినెల దాదాపు రూ.15 కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగిస్తే రానున్న రోజుల్లో నీటి ఇక్కట్లు రావని పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, అపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ బీ.విజయ్ కుమార్ రెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ చైర్మన్ జీ.రామేశ్వర రావు, కార్యదర్శి అంజయ్య పాల్గొన్నారు.