హైదరాబాద్

నేటి నుంచి అమీర్‌పేట-హైటెక్‌సిటీ మెట్రోరైలు పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ సమస్య..అడుగడుగున రోడ్డుపై అడ్డంకులతో అష్టకష్టాలు పడుతూ ప్రయాణం కొనసాగించే నగరవాసులకు మరో పదికిలోమీటర్ల మెట్రోరైలు అందుబాటులోకి రానుంది. దీంతో నగరంలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లు, ప్రాంతాల్లో సుమారు 60 శాతం ప్రాంతాల్లో మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినట్టే. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీల మధ్య ఏర్పాటు చేసిన పదికిలోమీటర్ల మెట్రో కారిడార్‌లో రైలు ప్రయాణాన్ని గవర్నర్ నరసింహన్ బుధవారం అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభించనున్నారు.
అనంతరం మెట్రోరైలు రెండో నెంబరు కోచ్‌లో మెట్రో ఎండీ డా.ఎన్వీఎస్ రెడ్డి, ఇతర ప్రముఖులతో కలిసి అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు, అక్కడి నుంచి తిరిగి అమీర్‌పేట వరకు ప్రయాణించనున్నారు. నగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్‌కు చెక్ పెట్టేందుకు సుమారు పనె్నండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో రూపకల్పన చేసిన మెట్రోరైలు మొదటి దశలోని మూడు కారిడార్లను ప్రతిపాదించారు. ఇందులో ఇప్పటికే రెండు కారిడార్లలో 46 కిలోమీటర్ల పొడువున మెట్రోరైలు పరుగులు తీస్తుండగా, తాజాగా ఈ పది కిలోమీటర్లు అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణం 56 కి.మీ.లకు పెరగనుంది. ఈ కారిడార్‌లోని మధురానగర్ మెట్రో స్టేషన్‌లో మహిళల కోసం ప్రత్యేక షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాక, ఈ కారిడార్‌లో మెట్రో అందుబాటులోకి రావటంతో అమీర్‌పేట, మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు కొంత ఊరట లభించనుంది.

అక్రమ నీటి కనెక్షన్ల గుర్తింపు
* ఇంటి యాజమానులపై క్రిమినల్ కేసులు
హైదరాబాద్, మార్చి 19: గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి విజిలెన్స్ పోలీసుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. జలమండలి విజిలెన్స్ పోలీసులు విభాగం సిబ్బంది గ్రూప్‌లుగా ఏర్పడి తనీఖీలు చేపడుతున్నారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ ఆదేశాల మేరకు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచందన్ రెడ్డి, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి పర్యవేక్షణలో దాడులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో భవనాలను తనిఖీ చేసి నీటి కనెక్షన్లను పరిశీలిస్తున్నారు. ఎపుడో తీసుకున్న నల్లా కనెక్షన్ స్థానంలో బహుళ అంతస్తు భవనం నిర్మించుకున్న ఇంటి యాజమానులు వారికి సంబంధించిన నీటి కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గతంలో ఉన్న నీటి కనెక్షన్‌ల స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీంతో బహుళ అంతస్తుల యాజమానులు జలమండలి అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చిన్నట్లు అక్రమ నీటి కనెక్షన్లను తీసుకుంటున్నారు. దీంతో అక్రమ నీటి కనెక్షన్లను గుర్తించి వారికి సహాకరించిన జలమండలి అధికారులు, సిబ్బందిపై కూడా విజిలెన్స్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ నీటి కనెక్షన్లు పొందిన ఇంటి యాజమానులపై స్థానకి పోలీస్టేషన్‌లలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా నాంపల్లి , సనత్ నగర్ పోలీస్టేషన్‌ల పరిధిలో నాలుగు అక్రమ నీటి కనెక్షన్లు గుర్తించిన జలమండలి విజిలెన్స్ పోలీసులు కేసులు నమోదు చేసింది. నాంపల్లిలోని బజార్ ఘాట్‌లో రెండు భవనాలకు సంబంధించిన నల్లా కనెక్షన్లను అక్రమ కనెక్షన్లుగా గుర్తించి ఇంటి యాజమానులు అమీనా బేగం, మహాముద్ అలీలపై నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో, సనత్‌నగర్‌లో అక్రమ నీటి కనెక్షన్లు పొందిన భవన యాజమానులు సత్యనారాయణ, మహమూద్ ఫారుఖ్‌పై ఎస్‌ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీ 269, 430, 379 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని జలమండలి విజిలెన్స్ విభాగం అధికారులు తెలిపారు.