హైదరాబాద్

ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో క్రమంగా పెరుగుతున్న వేసవి తాపం, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు ఎక్కువగా శీతల పానియాలు, పండ్ల రసాలు తీసుకుంటుంటారు. ఆదరణ, డిమాండ్ పెరగటంతో విక్రయదారులు నాణ్యత లోపించిన పండ్ల రసాలను, అపరిశుభ్రమైన వాతావరణంలో విక్రయించి ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు గుర్తించిన బల్దియా నగరంలో పండ్లు, పండ్ల రసాల విక్రయాలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ యాక్టు 1955 ప్రకారం ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటిస్తూ పండ్లు, పండ్ల రసాలను విక్రయించాలని సూచించింది. లేని పక్షంలో విక్రయదారులపై చర్యలు తప్పవని కూడా బల్దియా హెచ్చరించింది. ముఖ్యంగా నగరంలో పండ్ల, మండ్ల రసాలను విక్రయించే వారు పాటించాల్సిన మార్గదర్శకాలను జారీ చేసిన జీహెచ్‌ఎంసీ మున్ముందు వీటిని విక్రయించే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, లోపాలున్న వాటిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా షాపు యజమానులు పండ్లను సురక్షితమైన, ఓపెన్ ప్లేస్‌లో భధ్రపర్చుకోవాలని సూచించారు. కాయలను పండ్లుగా మక్కబెట్టేందుకు కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను వినియోగించరాదని అధికారులు సూచించారు. పుచ్చకాయతో పాటు ఇతర పండ్లను కట్ చేసే ముందు ఖచ్చితంగా పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. ఈ పండ్లను కట్ చేసేందుకు వినియోగిస్తున్న సామాగ్రికి ఎలాంటి తప్పులేకుండా చూసుకోవాలని, కట్ చేయక ముందు వాటిని వేడి నీటిలో కడగాలని సూచించారు. పండ్లను కట్ చేసే వారు, రసాలు చేసే వారు తప్పకుండా చేతులకు గ్లౌజెస్ ధరించాల్సి ఉంటుందని బల్దియా అధికారులు సూచించారు. ప్రతి దుకాణంలో వ్యర్థాలను వేసేందుకు ప్రత్యేకంగా డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సమీపంలోని చెరువులు, నాలాలు, రోడ్లపై వేయరాదని, వేసినట్లు గుర్తిస్తే జరిమానాలు విధించనున్నట్లు జీహెచ్‌ఎంసీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.