హైదరాబాద్

స్వచ్ఛ కార్యక్రమాలు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని పలు చారిత్రక కట్టడాలకు మరోసారి గుర్తింపునివ్వాలని కోరుతూ, ఈ స్థలాల్లో వారానికోసారి స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహించేలా అనుమతులివ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్లు బల్దియా కమిషనర్ దాన కిషోర్ వెల్లడిచారు. సర్కారుకు పంపనున్న ప్రతిపాదనలపై బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయలో జరిగిన జీహెచ్‌ఎంసీ పరిధి హెరిటేజ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీకి అధ్యక్షత వహించిన కమిషనర్ దాన కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ హెరిటేజ్ యాక్టు 2017లోని 22 ప్రకారం ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్ హెరిటేజ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఇందులో ఇద్దరు ఆర్కియాలజీ, హెరిటేజ్ హిస్టరీలో నిపుణులైన ఇద్దరిని సభ్యులుగా చేర్చుకోవల్సి ఉంటుందని, ఈ ఇద్దరి పేర్లను ఎంపిక చేసి పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు దాన కిషోర్ తెలిపారు. గతంలో హెచ్‌ఎండీఏ ద్వారా నగరంలోని ప్రధాన హెరిటేజ్, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛతకై ప్రాధాన్యతను ఇస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ద్వారా నగరంలోని ప్రధాన హెరిటేజ్, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛతకై ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రతి వారంలో ఒక రోజు చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత గోల్కొండ కోటలో చెత్త,వ్యర్థాలను తొలగించే ప్రక్రియ ప్రారింభించామని, కోట పరిధిలో ఉన్న చెరువుల అభివృద్ధి చేపట్టే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. వారసత్వ కట్టడాల పరిరక్షణపై ఇతర రాష్ట్రాలు, ఇంటాక్ ఆధ్వర్యంలో ఉన్న నియమ నిబంధనలను అధ్యయనం చేసి, వాటిని చేపట్టే విధంగా తగు ప్రతిపాదనలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పురావస్తు, మ్యూజియంల డైరెక్టర్ విశాలాక్షి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ హరీశ్, సీనియర్ పోలీస్ అధికారి తరుణ్ జోషీ, విశ్వప్రసాద్‌లతో ఆపటు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.