హైదరాబాద్

హోలీ కేలీ.. రంగులమయమైన వీధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చిన్నాపెద్దా అంటూ తేడాలేకుండా హోలీ..హోలీ.. హ్యాపీ హోలీ అంటూ అందరూ ఎంతో ఉత్సాహాంగా జరుపుకునే హోలీ సంబరాలు గురువారం మహానగరంలో ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు, గులాలు చల్లుతూ హ్యాపీ హోలీ చెప్పుకోవటం కన్పించింది. మరికొన్ని కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ హాళ్లలో ప్రత్యేకంగా హోలీ సంబరాలు నిర్వహించి, రంగులు పూసుకోవటం, గులాలు చల్లుకోవటంతో పాటు ఒరికొకరు స్వీట్లు పంచుకున్నా ఆనందోత్సవంగా జరుపుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా నగర పోలీసులు బుధవారం సాయంత్రం నుంచే నగరంలోని పలు సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఉదయం నుంచి కూడా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపై రంగులు చల్లుకోకుండా, వీధుల్లో, ఇళ్ల ముందు రంగులు చల్లుకునేలా పోలీసులు ఆంక్షలను అమలు చేశారు. జలవిహార్ వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు మరికొన్ని పార్కుల్లో స్థానికులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని హోలీ సంబరాలను నిర్వహించారు. ఐటీ, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఉదయం నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు హోలీ సంబరాలు నిర్వహించి, ఆ తర్వాత విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోవటం కన్పించింది.
ఘట్‌కేసర్: సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు స్నేహ సంబంధాలను మెరుగు పరిచే హోలీ మండుగ వేడుకలను ఘట్‌కేసర్ ప్రజలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జాతి, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా రంగులు చల్లుకుని నృత్యాలు చేస్తు హోలీ పండుగ వేడుకలను కన్నుల పండువగా జరుపుకున్నారు. ఎన్‌ఎఫ్‌సినగర్, ఏదులాబాద్, అవుషాపూర్, అంకుషాపూర్, సంస్కృతి టౌన్‌షిప్, నారపల్లి, చౌదరిగూడ, కొర్రెముల, ప్రతాపసింగారం గ్రామాలలో జరిగిన హోళీ వేడుకలలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో ప్రజలతో మమేకమై రంగులు చల్లుకుని నృత్యాలు చేయటం అందరిని ఆకర్షించాయి. ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువతులు ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు రంగులు పూస్తూ ర్యాలీగా వెళ్లటం అందరిని అలరించింది.