హైదరాబాద్

లష్కర్ ‘పోటీ’పై తమ్ముళ్ల తర్జనభర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో సికిందరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా? లేదా?అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీకి నగర టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు పోటీ చేసేలా అనుమతివ్వాలని కోరుతూ నగర తెలుగు తమ్ముళ్లు రెండురోజుల క్రితం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తీర్మానించిన సంగతి తెలిసిందే! కానీ ఆయనతో పాటు బీ.ఎన్.రెడ్డి, సిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మేకల సారంగపాణి కూడా టికెట్‌ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో సారంగపాణి ఒక్కరే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి అపజయం పాలు కాగా, మిగిలిన ఎం.ఎన్. బీఎన్‌రెడ్డిలు ఇప్పటి వరకు అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయలేదు.
అయినా ఈ ముగ్గురు నాయకుల పట్టు సికిందరాబాద్, ఖైరతాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాలకే పరిమితం కావటంతో లోక్‌సభ స్థానంలో పోటీ చేసేందుకు వీరి శక్తి సామర్థ్యాలు సరిపోవని, పార్టీ అధిష్టానం ఆర్థికంగా పలుకుబడి, జనంలో గుర్తింపు కల్గిన ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం అనే్వషిస్తున్నట్లు కూడా చర్చ లేకపోలేదు. టికెట్ తమకంటే తమకు కేటాయించాలని ముగ్గురు నేతలు పోటీ పడుతున్నా, అసలు సికిందరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలా? లేదా?, కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దతును ప్రకటించాలా? అన్న కోణంలో ఆలోచిస్తున్న అదిష్టానం ఇప్పటి వరకు టికెట్ ఆశిస్తున్న వారికి గానీ, రాష్ట్ర, నగర నేతలకు గానీ ఎలాంటి సంకేతాలివ్వలేదు. గత 2014 ఎన్నికలతో పాటు అంతకు ముందు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మిత్రపక్షంగా అభ్యర్థిని నిలపకుండా మొత్తం పార్టీ శ్రేణులు బీజేపీని గెలిపించాయి. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణ కారణంగా ఇపుడు బీజేపీ, టీడీపీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశాలున్నా, గెలిచే అవకాశాలు అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. గత 2014 ఎన్నికల్లో అప్పటి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ గెలుపు కోసం ఉభయ పార్టీల క్యాడర్ శ్రమించినా, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ తప్పలేదు. కానీ మజ్లీస్ పార్టీ ఎన్. మోహన్‌రావును అభ్యర్థిగా బరిలో నిలపటం వల్లే మైనార్టీ ఓట్లు చీలి బీజేపీకు గెలుపు సిద్దించింది. మరోవైపు గతంలో టీడీపీలో ఉండి, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి కొందరు టీడీపీ ముఖ్య నేతలు ఆయనకు టచ్‌లు ఉండటంతో టీడీపీ పోటీ చేస్తే ఆయనకు కలిసొచ్చే అవకాశముందన్న వాదన లేకపోలేదు.
టీఆర్‌ఎస్‌లో చేరినపుడు చాలా మంది టీడీపీ నేతలతో తనతో పాటు పార్టీ మారినా, కొందరు నేతలు ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. నేటికీ వారితోనూ, అన్ని వర్గాలకు చెందిన టీడీపీ నేతలతో సత్సంబంధాలున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు ఈ సారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండటంతో టీడీపీ పోటీ చేస్తే ఎలాంటి ప్రభావముంటుంది? అన్న అంశాన్ని టీడీపీ అదినాయకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరి పోటీ టీఆర్‌ఎస్‌కు కలిసొస్తుందా? అన్న కోణంలో కూడా టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు.
టీఆర్‌ఎస్, టీడీపీ పార్టీల మధ్య ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఆసక్తికరమైన రాజకీయ పరిణామాల మధ్య టీడీపీ సికిందరాబాద్ నుంచి కాస్త బలమైన అభ్యర్థినే బరిలో నిలపాలని యోచిస్తున్నా, ఆ అభ్యర్థి ఎవరు? అన్నది రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.