హైదరాబాద్

రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు ఏర్పడిన పలు యూనియన్లు ఉద్యోగులు, కార్మిక సంక్షేమాన్ని పక్కనబెట్టి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యాయని కొత్తగా ఆవిర్భవించిన స్వచ్ఛ గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక ఉద్యోగుల సంఘం విమర్శించింది. కొత్త ఏర్పడిన కార్మిక సంఘం.. అధ్యక్షుడు వై.రాజు నేతృత్వంలో సంఘం నేతల ప్రతినిధుల బృందం గురువారం కమిషనర్ దాన కిషోర్‌ను కలిసి, తమ సంఘం వివరాలను వివరించినట్లు రాజు వెల్లడించారు. రాజు మాట్లాడుతూ తమకు ఏ రాజకీయ పార్టీ గుర్తింపు లేదని, అసలు అవసరం లేదని, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయనున్న తమ యూనియన్‌కు, రాజకీయాలకు సంబంధం లేదని వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని, దీనికి సంబంధించి త్వరలోనే కార్యచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడిన తమ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ధర్మేంధర్, సలహాదారుడిగా సుదర్శన్, సంయుక్త కార్యదర్శిగా నర్సింగ్ రావు, ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా శ్రీ్ధర్, కోశాధికారిగా వై.విశ్వనాథ్‌ను నియమించినట్లు రాజు వెల్లడించారు. కమిషనర్‌ను కలిసిన వారిలో నూతన కార్యవర్గంతో పాటు సయ్యద్ యూసుఫ్, శ్రావణ్‌కుమార్, రాజు, సాయికుమార్, మోహన్‌రాజ్, నవీన్ కుమార్, సతీష్, గోపీకృష్ణ, మదుసూధన్, నర్సింగ్ రావు, అజయ్ కుమార్, అరవింద్ కుమార్ ఉన్నారు.