హైదరాబాద్

ఆధ్యాత్మికతోనే మనస్సుకి ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ఆధ్యాత్మికతోనే మనస్సుకి ప్రశాంతత కలుగుతుందని ప్రముఖ సామాజిక వేత్త, ఆధ్యాత్మిక వక్త బిజ్జ నాగభూషణం అన్నారు. గురువారం గానసభలో విలేఖరులతో మాట్లాడుతూ సమాజంలో ఒత్తిడి కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని పేర్కొన్నారు. కలుషిత అహారం తినడం వల్ల అనేక రోగాలకు తెచ్చుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక లోపంతో 50శాతం అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక పుస్తకాలు, ప్రవచనాలు వినడం, భగవంతున్ని నామస్మరణ చేయడంతో రోగాలను దూరం చేయవచ్చని అన్నారు. ఆరోగ్యం కాపాడుకోవాడానికి మంచి అహారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యం సాధిస్తేనే జీవితంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని బిజ్జ నాగభూషణం అన్నారు.
ముగిసిన ‘శాస్ర్తియ’ సంగీత మహోత్సవం
కాచిగూడ, ఏప్రిల్ 18: కినె్నర ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘శాస్ర్తియ సంగీత’ మహోత్సవం ముగింపు సభ గురువారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని ప్రసంగించారు. శాస్ర్తియ సంగీతానికి ఎంతో అదరణ ఉందని అన్నారు. ఐదు రోజుల పాటు శాస్ర్తియ సంగీత గాయకులను ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ గాయకులు కృష్ణ ఆదిత్య, కృష్ణ శంశాక్ అలపించిన శ్రీరామగానామృతం అలరించాయి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సిహెచ్ సీతారామయ్య సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, దర్శనం మాన పత్రిక సంపాదకుడు మరుమాముల వెంకటరమణ శర్మ, సంస్థ కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.