హైదరాబాద్

జల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరంలో శుక్రవారం మరోసారి చిరుజల్లులు మొదుకుని ఓ మోస్తరు జల్లులు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టినా, నాలుగు గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో జల్లులు కురిశాయి. శుక్రవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ శోభయాత్ర జరిగే కవాడిగూడ, గాంధీనగర్, అశోక్‌నగర్, బైబిల్ హౌజ్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆ తర్వాత సాయంత్రం ఆరున్నర నుంచి ఏడు గంటల మధ్య సికిందరాబాద్, పార్శిగుట్ట, వారాసిగూడ, ఇందిరా పార్కు, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో ఓ మోస్తారు జల్లులు కురిశాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్, గాంధీనగర్, కవాడిగూడ, సికిందరాబాద్ స్టేషన్, ఓలిఫెంటా బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో వర్షం ఆగిన తర్వాత కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు రావటంతో జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు. చినుకుడితేనే నీరు చేరే వాటర్ స్టాగినేషన్ పాయింట్ల వద్ద నీరు నిల్వకుండా ఇప్పటికే జీహెచ్‌ఎంసీ శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టగా, మరికొన్ని ప్రాంతాల్లో నీటిని అప్పటికపుడు వాటిని తోడేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉపరితల ఆవర్తనంతో మున్ముందు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హెచ్చరికలు అందటంతో జీహెచ్‌ఎంసీ బృందాలు అప్రమత్తమయ్యాయి.