హైదరాబాద్

‘మూకాభినయం’ పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : ఇండియన్ మిస్టర్ బీన్- మైమ్ కళాధర్ రచించిన ‘మూకాభినయం’ గ్రంథావిష్కరణ సభ కళాధర్ మైమ్ అకాడమీ, బాల సాహిత్య పరిషత్, శ్రీత్యాగరాయ గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా.అయాచితం శ్రీ్ధర్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. మైమ్ కళ చాలా ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. మైమ్ కళాధర్‌గా ప్రపంచ ప్రఖ్యాతి చెందాడని తెలిపారు. మైమ్ రంగంలో కళాధర్ తనకు తానే పోటీగా నటించారని వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకట రమణ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రంగస్థల కళల శాఖ అధిపతి కోట్ల హనుమంత రావు, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, కినె్నర కార్యదర్శి మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.
సామాజిక సేవలో భాగస్వాములు కావాలి
కాచిగూడ, ఏప్రిల్ 19: సామాజిక సేవలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. కీర్తన ఆర్ట్స్, మోహన్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపీణీ కార్యక్రమం శుక్రవారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వకుళాభరణం కృష్ణమోహన రావు పద్య గాన భూషణ డా.అక్కిరాజు సుందర రామకృష్ణ, గాయకుడు రాఘవాచార్యకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి పురస్కారాలు ప్రదానం చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో లయన్ విజయ్ కుమార్, వంశీ రామరాజు, సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి, సంస్థ అధ్యక్షుడు పీఎంకే గాంధీ పాల్గొన్నారు.