హైదరాబాద్

విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: విద్యార్థుల్లో ప్రతిభను పెంచేందుకు టాలెంట్ టెస్ట్‌లు దోహద పడుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి డా.సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. యూనిఫైడ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన టాలెంట్ సెర్చ్‌లో నిర్వహించిన పోటీలలో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు యూనిఫెడ్ కౌన్సిల్ నేషనల్ టాలెంట్ సెర్చ్ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేణుగోపాల చారి విచ్చేసి విద్యార్థులకు పురస్కారాలను ప్రదానం చేశారు. విద్యార్థులకు టాలెంట్ గుర్తించడానికి టెస్ట్‌లు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. విద్యార్థులకు గణితం, సైన్స్, కంప్యూటర్, ఇంగ్లీష్‌లో నిర్వహించిన సెర్చ్‌లో భారతదేశంతో పాటు ఇరాన్, అరబ్, కువైట్, ఒమన్, రష్యా, టాంజానియా దేశాల విద్యార్థులు పరీక్షలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. సమర్థవంతమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందించాడానికి తమ సంస్థ కృషి చేస్తుందని యూనిఫైడ్ కౌన్సిల్ సీఈవో శ్రీనివాస్ కల్లూరి అన్నారు. కార్యక్రమంలో సీఎఫ్‌వో వెల్స్ ఫాల్గొ ప్రైవేట్ లిమిటెడ్ సీ ఎఫ్‌వో రాకేష్, సింఘానియా, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ వివేక్ శర్మ, జగ్గలే ఫాండర్ చైర్మెన్ శ్రీరాజ్ పాల్గొన్నారు.
వాగ్గేయకారులకు అభినందన సభ
కాచిగూడ, ఏప్రిల్ 21: భద్రాచల రామగాన సమతి ఆధ్వర్యంలో పండరీపురం పాదయాత్ర నిర్వహించిన భక్తులకు అభినందన సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భద్రాచల రామగాన సమతి ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని పాదయాత్ర నిర్వహించిన వారిని అభినందించి సత్కారించారు. ఎంతో భక్తి శ్రద్దలతో పండరీపురం పాదయాత్రను దిగ్వీజయంగా పూర్తి చేసుకుని రావడం సంతోషదాయకమని అన్నారు. పాలమూరు వాగ్గేయకారులు రామచెర్ల వెంకటదాస గానామృతం అలరించింది. ఉమ్మెంతల పంచమ పీఠాధిపతి వెంకటదాసు నిర్వహణలో ప్రముఖ గాయకుడు యరగొల్ల శ్రీనివాస్ యాదవ్ బృందం రాకమచర్ల సంకీర్తనలు అలపించారు. కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పారిశ్రామిక వేత్త మురళీ ప్రసాద్ శర్మ, కల్యాణనంద పీఠం అధ్యక్షుడు బ్రహ్మశ్రీ పులిగడ్డ హనుమంతరాయ శర్మ, సామాజిక వేత్త రామచందర్ యాదవ్, యర్లగొల్ల శ్రీదేవి, శ్రీవాణి, నందిని, విష్ణుమూర్తి పాల్గొన్నారు.
అలరించిన సినీ సంగీత విభావరి
కాచిగూడ, ఏప్రిల్ 21: కల్పన కళా నికేతన్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ కవి రసమయి అధినేత డా. ఎంకే రాము, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రసాంజలి అధ్యక్షుడు మల్లికార్జునమ్, రంగస్థల నటుడు వనం శంకరయ్య పాల్గొని గాయనీ, గాయకులు అభినందించి సత్కరించారు. గాయకుడు జంగయ్య గౌడ్ నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి.