హైదరాబాద్

భవన నిర్మాణ అనుమతులు సులభతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భవన నిర్మాణ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి నిర్మాణ అనుమతుల నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసింది. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ మంగళవారం మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణ అనుమతులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసిన నేషనల్ బిల్డింగ్ కోడ్-2016కు అనుగుణంగా సవరించాలని రాష్ట్ర బిల్డర్స్, డవలపర్స్ అసొసియేషన్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో నిబంధనలను సవరించినట్టు అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. తాజాగా సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ హోమ్స్ నిబంధనల ప్రకారం గదుల వెలుతురుకు అనుమతించినట్టు పేర్కొన్నారు. అలాగే టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అనుమతి ఇస్తారు. గతంలో టెర్రస్‌పై స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో తాజా సవరించినట్టు పేర్కొన్నారు. భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇచ్చే ఆక్యుపెన్సి సర్ట్ఫికెట్ జారీకి ముందే బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలనే నిబంధనను విధించింది. రోడ్డు నిర్మాణం పూర్తి అయిన తర్వాతనే ఆక్యుపెన్సి సర్ట్ఫికెట్ జారీ చేస్తారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి నీటి కుళాయికి, అలాగే విద్యుత్ కనెక్షన్ల మంజూరికి ఆక్యుపెన్సి సర్ట్ఫికెట్ జారీకి ముందే దరఖాస్తు చేసుకోవచ్చు, అయితె తుది కనక్షన్‌లను ఆక్యుపెన్సి సర్ట్ఫికెట్ జారీ చేసిన తర్వాత ఇస్తారు. హైరైజ్ బిల్డింగ్‌లకు సెట్ బ్యాక్‌ను నేషనల్ బిల్డింగ్ కోడ్-2016 ప్రకారం నిర్దారిస్తారు. రోడ్ల విస్తరణలో తమ స్థలాలను అప్పగింతను ప్రోత్సహించడానికి ఫ్లోర్ టు ఫ్లోర్ ఎత్తు, భవనం టైపు, నమూనా విస్తరణకు ముందు విస్తరణ తర్వాత ఒకే తరహాలో ఉండాల్సిన అవసరం లేదని సవరించారు. అలాగే బిల్డింగ్ ఏరియా అనుమతించిన మేరకు ఉండాలనే నిబంధనను విధించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.