హైదరాబాద్

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యకు తోడ్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో విద్యను అందించేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలో తోడ్పాటును అందిస్తున్నట్టు సింక్రోని సంస్థ ప్రతినిధి జోయల్ తెలిపారు. మంగళవారం యూసఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్‌తో కలిసి డిజిటల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద చిన్నారులకు సాంకేతికతతో అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే లక్ష్యంతో తాము ఈ డిస్ట్రప్టివ్ డిజిటల్ ఇంటర్వెన్షన్ (డీడీఐ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్మాణ్ సంస్థ సహకారంతో ల్యాబ్‌లను ఏర్పాటుచేసి విద్యార్థులకు సాంకేతిక అంశాలు, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల అభివృద్ధిపై శిక్షణ అందించనున్నామని వివరించారు. కార్యక్రమంలో త్రిష్ మాస్కోని, ఆండీ పోనే్నరి పాల్గొన్నారు.
శారద నృత్య నికేతన్ ఆధ్వర్యలో కూచిపూడి నృత్య ప్రదర్శన 25న
కాచిగూడ, ఏప్రిల్ 23: శారద నృత్య నికేతన్ 24వ వార్షికోత్సవం సందర్భంగా శారద నృత్య నికేతన్ ఆధ్వర్యలో ‘కూచిపూడి’ నృత్య ప్రదర్శన ఈనెల 25వ తేది రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ శైలజ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 24 సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో అనేకమంది కళాకారులను ప్రొత్సహించినట్లు వివరించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో పాటు డిప్యూటీ కమిషనర్ పీవీ పద్మజ, నల్లా ఫౌండేషన్ చైర్మన్ నల్లా మనోహర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.