హైదరాబాద్

మూడు నెలల్లో పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్ పనులు దశలవారీగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే పలు అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన జీహెచ్‌ఎంసీ ఇపుడు ఎల్‌బీనగర్ అండర్‌పాస్ నిర్మాణంపై దృష్టి సారించింది. కమిషనర్ దాన కిషోర్ బుధవారం అండర్‌పాస్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అండర్‌పాస్ నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వస్తే ఎల్‌బీనగర్ జంక్షన్‌లో సుమారు 90 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతోందని వివరించారు. అండర్‌పాస్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియ వేగవంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.44.74 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అండర్‌పాస్ పనులు చేపట్టినట్లు తెలిపారు. 520 మీటర్ల పొడువు అండర్‌పాస్‌లో ఎల్‌బీనగర్ ఎడమవైపు నిర్మాణంలో 17 రాఫ్ట్‌లు, 76 రిటైనింగ్ లిఫ్టులు, 111 ప్రీకాస్ట్ బాక్స్ వాల్ సెగ్మెంట్లు, 49 బాక్స్ ఫ్రీ స్లాట్ ఫ్లాంక్‌ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. అండర్‌పాస్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు నాలుగు నెలల సమయం పడుతోందని ప్రాజెక్టు ఇంజనీర్లు వివరించగా, మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అండర్‌పాస్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఎస్‌ఆర్‌డీపీ పనులకు నిధుల కొరత ఏమీ లేదని, జీహెచ్‌ఎంసీ జనరల్ ఫండ్ నుంచి రూ. 42 కోట్లను ఎస్‌ఆర్‌డీపీ బిల్లులుగా చెల్లించామని వివరించారు. ఎన్నికల తర్వాత రుణం తీసుకోనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. తనిఖీలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.