హైదరాబాద్

పార్కులుగా 616 ఖాళీ స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో ప్రారంభం కానున్న వర్షాకాలంలో నిర్వహించనున్న హరితహారం కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ సన్నాహాలను ప్రారంభించింది. ఈసారి నగరంలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో మొత్తం కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యంతో హరితహారం కోసం ప్రత్యేక జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ నర్సరీలు, ప్రైవేటు నర్సరీలను తనిఖీ చేసి అందుబాటులో ఉన్న మొక్కలు, వాటి ప్రాముఖ్యత, కావల్సిన మొక్కలు వంటి అంశాలపై నివేదికలను సమర్పించాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ తనిఖీలకుగాను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో వేర్వేరు కమిటీలను నియమిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు వర్షాకాలం ప్రారంభం కాగానే ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వీలుగా కాలనీ సంక్షేమ సంఘాలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని సూచించారు. గతంలో మాదిరిగానే కొత్తగా నాటే మొక్కలకు ట్రీగార్డులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమకూర్చుకోవాలని సూచించారు. లక్ష ట్రీగార్డులను సమకూర్చేందుకు గాను జోనల్ కమిషనర్లకు టార్గెట్లు విధించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖాళీ స్థలాలుగా ఇప్పటికే గుర్తించిన 616 ప్రాంతాలను చక్కటి పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన పార్కులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ రకంగా ఖాళీగా ఉన్న స్థలాలు అన్యాక్రాంతమవుతున్నట్లు ఇప్పటికే కొందరు వ్యక్తులు, పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు రావటంతో వాటి పరిరక్షణ కోసం పార్కులుగా మార్చాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. దీనికితోడు పదేళ్ల క్రితం ఏర్పాటుచేసిన 331 ట్రీ పార్కుల్లోని ఖాళీ స్థలాల్లో కూడా హరితహారం మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీకి చెందిన ప్రధాన పార్కుల్లో ఏర్పాటుచేసిన క్రీడాపరికరాల నిర్వహణ బాధ్యత క్రీడా విభాగం పరిధిలో ఉండగా, ఆ బాధ్యతను బయోడైవర్శిటీ విభాగానికి అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.