హైదరాబాద్

హై‘బీపీ’తో అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నలుగురు స్నేహితులు, పది మంది బంధువులు కలిశారంటే చాలు.. వారిలో ఒకరిద్దరు అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారే ఉంటారు. ఈ రోజుల్లో బీపీ, షుగర్ మామూలైపోయాయంటూ చర్చించుకోవటం సర్వసాధారణం. మన శరీరంలో రక్తప్రసరణ జరగాల్సిన వేగం కన్నా ఎక్కువ వేగంగా ప్రసరించటం, పలు అవయవాలకు ఎక్కువ, తక్కువ రక్తం సరఫరా కావటమే హై, లో బీపీ. వీరిలో ఎక్కువ మంది హైబీపీ బారిన పడి హైపర్ టెన్షన్‌కు గురవుతుంటారు. వీరిలో చాలా మందికి తమకు హై బీపీ ఉందని, తాము హైపర్ టెన్షన్ బారి పడ్డామని తెలీకా, స్వల్ప అనారోగ్యంగా పరిగణిస్తుంటారు. కానీ బీపీలో హెచ్చుతగ్గులు వచ్చాయంటే మనలో అనారోగ్యం బెల్ మోగినట్టే. ఫలితంగా పని ఒత్తిడి పెరిగి, మానసిక పరిస్థితులు బాగా లేనపుడు నడుస్తూనే, నవ్వుతూనే ఉన్నపుడు, భోజనం చేస్తున్నపుడు, నిద్రలోనే గుండె, కిడ్నీ వంటి ముఖ్యమైన అవయావాలు ఫెయిల్ అయి అకాల మరణం చెందటం, మెదడు స్ట్రోక్ వచ్చి పక్షపాతం బారిన పడటం వంటివి సంభవిస్తుంటాయి. మన శరీరంలో సైలంట్ కిల్లర్‌గా మారుతున్న ఈ వ్యాధిపై అవగాహన లేకపోవటంతో, ఒకవేళ అవగాహన కలిగి, వారి నిర్దారణ అయిన వారిలో కూడా ఎక్కువ మంది తప్పుడు చికిత్స తీసుకుంటున్నట్లు ఇటీవల అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యాధిపై ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంపొందించేందుకు ఈనెల 17వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు హైపర్‌టెన్షన్ అవగాహన మాసోత్సవంగా నిర్వహించాలని ఇంటర్నేషనల్ హైపర్‌టెన్షన్ సొసైటీ, వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటించాయి. వ్యాధి బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, వ్యాధి నిర్దారించబడిన తర్వాత జీవన శైలిలో చేసుకోవల్సిన మార్పులు, చికిత్స విధానాలు వంటి అంశాలను వరల్డ్ హైపర్‌టెన్షన్ డే సందర్భంగా నగరంలోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్సల్టెంట్ కార్డియాలజిస్టు డా.సుధీర్ కోగంటి వెల్లడించారు.
హైపర్ టెన్షన్ అంటే ఏమిటీ?
హైపర్ టెన్షన్ అంటే మన శీరీరంలోని రక్తప్రసరణ మోతాదు వేగానికి మంచి ప్రవహించటంతో వచ్చే హైబీపీ కారణంగా ముదిరే వ్యాధి. రక్తపోటు 110/90 గా నమోదైతే అది మోతాదు రక్తపోటుగా పరిగణిస్తారు. మన ఆహారపు అలవాట్లు, వయస్సు, మారుతున్న యాంత్రిక జీవనం, కాలానికగుణంగా ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు, పెరుతున్న పనిభారం, మానసిక ఒత్తిడి, మన భౌగోళిక పరిస్థితులకు సరితూగకుండా ఆహారపు అలవాట్లు చేసుకోవటం, పెరుగుతున్న వాయు, శబ్ద కాలుష్య వాతావరణంలో ఎక్కువ గడిపినపుడు, సకాలంలో భోజనం చేయకుండా ఫామ్ అయ్యే గ్యాస్‌తో జీర్ణశక్తి తగ్గటం వంటివి అధికంగా రక్తపోటు నమోదయ్యేందుకు కారణం. రెండేళ్ల క్రితం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం రక్తపోటు 130/80గా నమోదయ్యే వ్యక్తి హైపర్‌టెన్షన్ వ్యాధి మొదటి దశకు చేరుకున్నట్టేనని డా.సుధీర్ వెల్లడించారు. వీరు వెంటనే వైద్యులను సంప్రదించి, ఎప్పటికపుడు రక్తపోటు పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందాలని సూచించారు. ఒక్కసారి అధిక రక్తపోటు నమోదైన తర్వాత ఆహారపు అలవాట్లు, జీవవ శైలిలో మార్పులతోనే ఈ సమస్యను అధిగమించవచ్చునని వెల్లడించారు.
జీవన శైలిలో చేసుకోవల్సిన మార్పులు
హైపర్‌టెన్షన్ మొదటి దశగా చెప్పుకునే హైబీపీ కల్గిన వారు సింపుల్‌గా తమ ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకుని రక్తపోటును కంట్రోల్ చేసుకోవచ్చు. రక్తనాళాలను దెబ్బతిసే ఫ్లూయిడ్స్‌కి కారణమయ్యే ఉప్పు, సోడియం వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ పండ్లు, సోడియం స్థాయిని బ్యాలెన్స్ చేసే పోటాషియం ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకుంటే మంచిది. తప్పకుండా వ్యాయామం అలవాటు చేసుకోవాలి, ఇది రక్తనాళాలపై వత్తిడి తగ్గించి, గుండెకు బలాన్ని చేకూరుస్తుందని వివరించారు. అధిక రక్తపోటు నమోదైన వారికి మద్యపానం, దూమపానం వంటి అలవాటు ఏమైనా ఉంటే, వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు. హైపర్‌టెన్షన్ బారిన పడిన వారందరికీ చికిత్స ఒకే విధంగా ఉండదని, వారి ఆరోగ్య, శరీర పరిస్థితులను బట్టి చికిత్స చేయాల్సి వస్తుందని డా.సుధీర్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాధి బారిన పడి వారిలో ఎక్కువ మంది తప్పుడు చికిత్స చేయించుకుంటున్నారంటూ ఇటీవలే అధ్యయనాల్లో తేలటంతో ఫస్ట్ లేదా సెకండ్ లైన్ మందులుగా పేర్కొన్న బీటాబ్లాకర్స్ (ఎటినాలోల్, మెటోప్రోల్) మందులను ప్రెస్క్రేబ్ చేస్తున్నారు. కానీ ఫస్ట్, సెకండ్ లైన్ ఏజెంట్లు కొంతకాలం క్రితమే కనుమరుగయ్యాయి. కరోనరీ వ్యాధి లేదా, హార్ట్‌ఫెయిల్యూర్ ఉంటే తప్ప వీటిని వాడటం లేదనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.