హైదరాబాద్

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మొగల్‌పురా ప్లేగ్రౌండ్‌లో జరిగిన స్పోర్ట్స్ క్వీజ్ పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ స్పోర్ట్స్ డైరెక్టర్ బీ.సుమన్ రావు, గేమ్స్ ఇన్‌స్పెక్టర్ కే.వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పోటీలో యాకుత్‌పురా ఎస్‌ఆర్‌టీ-1 ప్లేగ్రౌండ్‌కు చెందిన సయ్యద్ అబు బాకార్, సయ్యద్ హమీద్ అలీ (క్రికెట్) జోడీ ప్రథమ స్థానంలో నిలువగా, గౌలిపురా ప్లే గ్రౌండ్‌కు చెందిన కబడ్డీ క్రీడాకారులు డీ.కార్తీక్, సోమేశ్వర్, క్రికెటర్లు అనూజ్, అభినయ్‌లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఖైర్‌తాబాద్ జోన్‌లో నిర్వహించిన క్వీజ్ పోటీలో బీ.సోహన్, జీ.విక్రందేవ్ (వీపీజీ), బీ.సాయి వరుణ్ గుప్తా, ప్రంజల్ ఠాకుర్ (రహీంపుర), ఎస్.అభినవ్ యాదవ్, కేఎల్‌వీ కార్తీకేయ వరుస స్థానాల్లో నిలిచారు. సికింద్రాబాద్ జోన్ క్వీజ్ పోటీలు సికింద్రాబాద్ స్విమ్మింగ్ పూల్ ఆవరణలో నిర్వహించారు. పోటీలో ఎం.శ్రీసాయి, డీ.శివ (మారెడ్‌పల్లి పీజీ -క్రికెట్), ఈ.హరీష్, ఈ.సాయిచంద్ (టాటాచారి పీజీ - బాక్సింగ్), ఎన్.సాథ్వీక్, ఎస్‌ఎన్‌వీ రీషబ్ (సెయింట్ పాల్స్ పీజీ - వాలీబాల్)ల జోడీ వరుస స్థానాల్లో నిలిచి ట్రోఫీలను అందుకున్నారు. డీఎంసీ కే.వేణుగోపాల్, గేమ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.