హైదరాబాద్

పిల్లల అభిరుచికి తగ్గట్టు ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పిల్లల ఏఏ అంశాలపై ఎక్కువ ఆసక్తి, అభిరుచిని చూపుతున్నారన్న విషయాన్ని గుర్తించి, వారిని అవే అంశాల్లో ప్రోత్సహిస్తే వారు తేలికగా రాణించగలరని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సి. గంగ అన్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠి సమితి ఆధ్వర్యంలో గత పదిరోజులుగా నిర్వహిస్తున్న చిన్నారుల వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం శనివారం ఆబిడ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గంగ తొలుత వివిధ అంశాల్లో ప్రతిభను కనబర్చిన చిన్నారులకు సర్ట్ఫికెట్లను, బహుమతులను బహుకరించారు. పదిరోజులు శిక్షణ శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న పలు కళాంశాలు, వేద పఠనం, భజనలు, సత్యసాయి ఇంగ్లీష్ భక్తిపాటలు ఆలపించి ఆకట్టుకున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠి విభాగం అధ్యక్షులు పి.విశే్వశ్వరశాస్ర్తీ మాట్లాడుతూ ప్రతి ఆదివారం యదావిధిగా బాలవికాస్ తరగతులను ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ అంశాల్లో చిన్నారులకు పదిరోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరం విజయవంతం అయిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాలవికాస గురువు రేణుక, మహిళా విభాగం ఇన్‌ఛార్జి విజయలక్ష్మి, సేవాదళ్ సభ్యులు రవీందర్ రెడ్డి, సునీత, పద్మావతి, సబితాతో పాటు బాలబాలికల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.