హైదరాబాద్

అన్నమాచార్య సంకీర్తనలు విశ్వవ్యాప్తం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు విశ్వవ్యాప్తం చేయాలని పలువురు వక్తలు అన్నారు. అన్నమాచార్య 611వ జయంతి మహోత్సవ వేడుకలు నవ్య నాటక సమితి, అన్నమాచార్య మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వ రావు, ప్రముఖ సంగీత విద్వాంసులు డా. ఎం.చిత్తరంజన్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు కామిశెట్టి శ్రీనివాసులు, కళాకారిణి ఆనంద, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వీ.విజయ్ కుమార్, ఆర్‌ఎస్ సుధారాణి పాల్గొన్నారు. మరుగున ఉన్న అన్నమాచార్య కీర్తనలు వెలికితీసి వాటికి ప్రాచుర్యం కల్పించాలని పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడు డీవీ మోహనకృష్ణ బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలు, నృత్యమాల డ్యాన్స్ అకాడమీ, మంజీర నృత్య అకాడమీ, లాస్యాంగ స్కూల్ ఆఫ్ కూచిపూడి విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

తెలంగాణ కళలను కాపాడుకోవాలి
కాచిగూడ, మే 18: తెలంగాణ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీ ఎస్ రాములు అన్నారు. హరికథా భాగవతారిణి వీ.నాగరాణిచే ‘శివలీలలు’ హరికథా గానం శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో శనివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీఎస్ రాములు మాట్లాడుతూ, హరికథలను శ్రీత్యాగరాయ గానసభ ఎంతో ప్రొత్సహిస్తుందని పేర్కొన్నారు. నాగరాణి నిర్వహణలో నిర్వహించిన శివలీలలు హరికథా గానం ఆకట్టుకుంది. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో శంకరం వేదిక కోశాధికారి యలవర్తి ధనలక్ష్మీ, తెలంగాణ హరికథకుల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, గానసభ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.