హైదరాబాద్

జల సంరక్షణతోనే భావితరాల మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అనే నగరాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని, సౌతాఫ్రికలోని కేఫ్‌టౌన్ సిటీ ఇప్పటికే నీరు లేని ప్రపంచంలోని తొలి నగరంగా ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, జల సంరక్షణకు ఉద్యమించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పిలుపునిచ్చారు. నీటి వనరులను కాపాడుకుంటేనే భావితరాలు మనుగడ సాగించగలవని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
వాటర్ హార్వేస్టింగ్ డే ను పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో దాన కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఒక్కరోజే సుమారు రికార్డు స్థాయిలో దాదాపు పది వేల ఇంకుడు గుంతలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశామని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన గుంతలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే ప్రతి గుంతను జియో ట్యాగింగ్ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వీటితో పాటు ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాలు, పార్కుల్లో జీహెచ్‌ఎంసీ నిర్మించిన ఇంకుడు గుంతలకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని ఆయన ఆదేశించారు. తాము ఊహించిన విధంగానే ఇంకుడు గుంతల మరమ్మతులకు నగరవాసులు వేలాది మంది తరలిరావటం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కేఫ్‌టౌన్ సిటీ మాదిరిగా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే నగరంలో కురిసే ప్రతి వర్షపు బొట్టు నీటిని ఒడిసి పట్టుకోవల్సిన అవసరముందని అన్నారు.
నగరంలోని ప్రతి కాలనీ సంక్షేమ సంఘం ఒక్కోక్కటి కనీసం రెండు ఇంకుడు గుంతలను నిర్మించాలని కమిషనర్ దాన కిషోర్ పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కమ్యూనిటీ హాల్స్‌తో పాటు కాలనీల్లోని ఖాళీ స్థలాలన్నింటిలోనూ ఇంకుడు గుంతలను నిర్మించి, భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. ఇళ్లు, పార్కులు, కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో ఇప్పటకే ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పరిశీలించి, అందులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, వాటిల్లో నీరు ఇంకేలా వాటిని సిద్దం చేయాలని సూచించారు.
పాల్గొన్న పలువురు ప్రముఖులు
గ్రేటర్‌లోని అన్ని సర్కిళ్ల పరిధుల్లో శనివారం నిర్వహించిన వాటర్ హార్వేస్టింగ్ డే కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా మల్కాజ్‌గిరిలోని గౌతమ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మీస్ ఆసియా పసిఫిక్ సుధాజైన్, మిస్ ఇండియా ఇంటర్నేషనల్ మమతా త్రివేది, జాతీయ కథక్ నృత్య కళాకారిణి, శిల్పాచక్రవర్తి పాల్గొని, ఇంకుడు గుంతల కోసం కదిలిన ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.