హైదరాబాద్

ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాదర్‌ఘాట్: వేసవి రద్దీ దృష్ట్యా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. శనివారం విలేఖరుల సమావేశంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రాఘవేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, గద్వాల, వనపర్తి, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, నెల్లూరు తదితర ప్రాంతాలకు రోజూ 200 బస్సులను అదనంగా నడుపుతున్నట్లు చెప్పారు. రద్దీకి వీలుగా అవసరమైతే బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు వివరించారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆర్మూర్, జహీరాబాద్ ప్రాంతాలకు కూడా అదనంగా బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. ఎంజీబీఎస్‌లో సౌకర్యాలను మెరుగుపరిచామని- రిజర్వేషన్ కౌంటర్, కరెంట్ బుకింగ్, విచారణ కేంద్రాలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా సిబ్బందిని సమాయత్తపరిచినట్లు తెలిపారు. ప్రయాణికులకు 15 రోజులు ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. బస్సులకు సరిపడా రద్దీ వుంటే శివారు కాలనీల నుంచే బస్సులను గమ్యస్థానాలకు నడిపిస్తామని తెలిపారు.