హైదరాబాద్

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడుతుందని అరా సంస్థ సర్వే వెల్లడించింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సర్వే వివరాలను సంస్థ వ్యవస్థాపకుడు షేక్ మస్తాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాలకు 119 స్థానాలు వైసీపీ స్పష్టమైన మైజారిటీ సాధించే అవకాశం ఉందని అన్నారు. టీడీపీ 47 స్థానాలను, జనసేన 2 స్థానాలతో సరిపెట్టుకుందని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారి అధికారం చేపట్టిన టీడీపీ పట్ల ప్రజలు సానుకూలంగా లేరని తమ సర్వేలో తెలిందని చెప్పారు. రాజధాని నిర్మాణం, ప్రాజెక్టులు, శాంతిభద్రల వైఫల్యం వంటివి ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని చెప్పారు. ఏప్రిల్ 17 నుంచి మే 18 మధ్య కాలంలో తమ సంస్థ ప్రతినిధులు ప్రతి నియోజకవర్గంలో తిరిగి సేకరించిన వివరాల ప్రకారం వైసీపీ 119 స్థానాల్లో మెజారిటీలో ఉండగా, మరో తొమ్మిది స్థానాలను సైతం చేజిక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ గెలిచే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఓటమిని చవి చూస్తారని, గాజువాకలో మాత్రం స్వల్ప మెజారిటీతో గట్టేక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. విశాఖ నుంచి పోటీ చేస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో మహిళలను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రభావం స్వల్పంగా ఉందని తేలిందని అన్నారు. రాష్ట్రంలోని పురుషులు అత్యధికలు వైసీపీకి మద్దతు పలకగా, మహిళలు 48 శాతం టీడీపీ వైపునకు మొగ్గుచూపారని తెలిపారు. 25 స్థానాలు కలిగిన ఏపీలో 22 ఎంపీ స్థానాలను వైసీపీ, కేవలం మూడు స్థానాలను మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.