హైదరాబాద్

మ్యాన్ హోల్స్ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో 2వేల కిలో మీటర్ల జీహెచ్‌ఎంసీ రోడ్డు వెంబడి ఉన్న మ్యాన్ హోల్స్ మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని జల మండలి కార్యాలయంలో సోమవారం మ్యాన్ హోల్స్ నిర్మాణం, మరమ్మతులు, వేసవిలో మంచినీటి సరఫరాపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరమ్మతుల పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడోద్దని ఆదేశించారు. రోడ్డుపై పనులు జరిపేటపుడు రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. వేసవిలో మంచినీటి సరఫరాపై ఈ సందర్భంగా చర్చించారు. మ్యాన్‌హోల్స్ నిర్మాణం చేస్తున్న ప్రాంతాల్లో మిగిలిన నిర్మాణ వ్యర్థాలను నగరవాసులకు ఇబ్బందులు కలుగకుండా వెంటనే తరలించాలని సూచించారు. ఆలాగే ఉదయం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 2 వేల కిలోమీటర్ల రోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్స్ సమాంతరంగా చేసే మరమ్మత్తు ప్రక్రియపై సంబంధిత డైరెక్టర్లు, సీజీఎం, జీఎంలతో ఎండీ ఎం.దానకిషోర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ఈనెల చివరి వరకు రోడ్డుకు సమాంతరంగా మ్యాన్ హోల్స్ మరమ్మతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. జలమండలి ఆపరెషన్స్ విభాగం డైరెక్టర్‌లు అజ్మీరాకృష్ణ, పీ.రవిలతో పాల్గొన్నారు.