హైదరాబాద్

అంతా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. నేటి నుంచి కేవలం కొద్ది గడువు ఉండటంతో ఫలితాలెలా వస్తాయోనన్న విషయంపై రాజకీయవర్గాల్లో ఇప్పటివరకున్న ఉత్కంఠ రెట్టింపయింది.
సుమారు 45రోజుల క్రితం పోలింగ్ జరిగిన నగరంలోని హైదరాబాద్, సికిందరాబాద్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసిన ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రెండు, మూడురోజుల పాటు ఎవరికి వారే గెలుపు ధీమాతో లెక్కలు వేసి, కౌంటింగ్‌కు ఎక్కువ సమయం ఉండటంతో సామాన్య ప్రజలు ఆ విషయానే్న మర్చిపోయారు. కానీ కౌంటింగ్‌కు ఇంకా మూడు రోజులకు ముందే పలు సంస్థలు పార్లమెంటు, ఇతర రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాజకీయ నేతల్లో కలవరాన్ని రెట్టింపు చేసింది. రాష్ట్రంలో బీజేపీ సిట్టింగ్ స్థానమైన సికిందరాబాద్‌లో ఎవరు గెలుస్తారన్న అంశంపై ఇప్పటి వరకున్న ఉత్కంఠ ఇపుడు రెట్టింపయ్యింది. అంతేగాక, మొత్తం 17 పార్లమెంటు సీట్లలో టీఆర్‌ఎస్‌కు16, మరొకటి మజ్లీస్ కైవసం చేసుకుంటుందని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నా, పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం బీజేపీకి ఒకటి నుంచి రెండు స్థానాలు వచ్చే అవకాశముండటంతో, సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని కమలనాధుల్లో ఆశలు చిగురించాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్‌రెడ్డి ఇప్పటికే పలుసార్లు అంబర్‌పేట నియోజకవర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభ పక్ష నేతగా సేవలందించిన సంగతి తెలిసిందే! ఎలాంటి వివాదాల్లేని కిషన్ రెడ్డి సికిందరాబాద్‌లో గెలుస్తారన్న ఇప్పటి వరకు వాదించిన వారి సంఖ్య ఇపుడు రెండింతలైంది. ఇదే నియోకవర్గం నుంచి ధీమాతో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ మొట్టమొదటి సారిగా ఎన్నికల బరిలో నిలవటం, పైగా ఆయన తండ్రి మంత్రి కావటంతో గెలిచి తీరుతారని టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఎగ్జిట్‌పోల్ సర్వే బీజేపీకి ఒకటి నుంచి రెండు స్థానాలొచ్చే అవకాశముందని తేల్చటంతో రెండు స్థానాల మాట దేవుడెరుగు కానీ దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలమైన పవనాలు వీయటం, ఇప్పటి వరకు బీజేపీ పట్టు సాధించని ప్రాంతాల్లో కూడా ఫలితాలు మెరుగ్గా వచ్చే అవకాశాలున్నట్లు సర్వేలో తేలటంతో సిట్టింగ్ స్థానమైన సికిందరాబాద్ నుంచి గెలవటం పెద్ద కష్టమేమీ కాదని కొందరు బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
సిట్టింగ్ సీటు అయిన సికిందరాబాద్‌లో కమలం వికసిస్తుందని బెట్టింగ్‌లు కూడా కాస్తున్న వారు లేకపోలేరు. ఎవరు ఎన్ని అంచనాలు వేసుకున్నా, లష్కర్‌లో కారు పరుగు తీస్తుందా? కమలం వికసిస్తుందా? వేచి చూడాలి.