హైదరాబాద్

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈ నెల 23వ తేదీన నగరంలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. నగరంలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 17 లక్షల 86వేల 515 ఓట్లు నమోదు కాగా, సికిందరాబాద్‌లో 9లక్షల 10వేల 437 ఓట్లు, హైదరాబాద్‌లో పోలైన 8లక్షల 76వేల 78 ఓట్లను లెక్కించేందుకు 12 కేంద్రాలను, ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కమిషనర్ ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌంటింగ్‌లో మొత్తం 528 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నట్లు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మరో ఇరవై శాతం 116 మందిని రిజర్వులో ఉంచినట్లు తెలిపారు. తుది దశగా బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లో ఓట్లను లెక్కించే తీరుపై ప్రత్యేకంగా శిక్షణనివ్వనున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ రోజున సిబ్బంది ఉదయం ఆరు గంటలకల్లా విధుల్లోకి రావాలని, అలాగే పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఏడు గంటలకు కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను తెరిచి, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను బయటకు తీస్తామని, ఈ ప్రక్రియ మొత్తం వీడియో చిత్రీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎండలు మండిపోతున్న కూలర్లను ఏర్పాటుచేసి, తాగునీరు, మజ్జిగా వంటివి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్, సికిందరాబాద్ ఎంపీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్ కన్నన్, జాయింట్ కలెక్టర్ రవి హాజరయ్యారు.