హైదరాబాద్

‘సువిధ’తో కౌంటింగ్ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల ఫలితాలను జిల్లా ఎన్నికల సిబ్బంది కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ‘సువిధ’ యాప్ ద్వారానే వెల్లడించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి 12 కేంద్రాలను ఏర్పాట్లు చేసి, ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసింది. ప్రతి రౌండ్‌కు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలను, స్థానిక రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే ముందుగా సువిధ యాప్ ద్వారా భారత ఎన్నికల సంఘానికి పంపి అవే వివరాలను సంబంధిత శాఖ ద్వారా అధికారికంగా ప్రకటించనున్నట్లు బల్దియా ఎన్నికల జాయింట్ కమిషనర్ పంకజ వెల్లడించారు. మన జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ఇదివరకే ముగిసినందున, కేవలం పార్లమెంటు ఎన్నికకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నందున, రౌండ్ల వారీగా ఫలితాలు వెంటనే వెల్లడించే అవకాశమున్నా, అధికారికంగా చేయాల్సిన ప్రకటనకు కాస్త సమయం పట్టే అవకాశముందని తెలిపారు.
డ్రా తో లెక్కించాల్సిన
వీవీ ప్యాట్‌ల ఎంపిక
ఈవీఎంలలోని ఓట్లతో పాటు ఓటరు తాను అనుకున్న అభ్యర్థికే ఓటు వేశారా? లేదా? అనే సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఈ సారి మొట్టమొదటి సారిగా వీవీ ప్యాట్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపుపై అనుమానాలుండటంతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలలో డ్రా ద్వారా ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్‌లను పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో ఒకటి తర్వాత మరొకటి లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపును చేపట్టి, చిట్టచివరిగా వీవీ ప్యాట్‌లను లెక్కించనున్నట్లు ఎన్నికల జాయింట్ కమిషనర్ పంకజ తెలిపారు. వీటిని లెక్కించే సమయం కల్లా కౌంటింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నా, వీవీ ప్యాట్‌ల లెక్కింపు ఏజెంట్లు, అభ్యర్థుల ముందు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా, ఒకదాని తర్వాత మరొకటి ఐదింటిని లెక్కించనున్నట్లు వివరించారు.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
మెహిదీపట్నం: హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా కార్వాన్ నియోజకవర్గం పరిధికి చెందిన కౌంటింగ్ కేంద్రాన్ని మాసాబ్‌ట్యాంక్‌లో పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఏర్పాట్లు చేశారు. గురువారం కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది.
కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కొనసాగవచ్చని అసిస్టెంట్ ఎన్నికల అధికారి సుధాన్ష్ తెలిపారు. గుర్తింపు కార్డులు లేకుండా లోనికి అనుమతి ఇచ్చేది లేదని పేర్కొన్నారు. ఇప్పటికే సిబ్బందికి గుర్తింపు కార్డులను కూడా అందజేశామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లును ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. ఫలితాలను ప్రతి రౌండు వారీగా మీడియాకి తెలియజేస్తామని అన్నారు. ఈ కేంద్రంలో మీడియా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు, అక్కడి వరకే మిడియాకు అనుమతి ఉందని పేర్కొన్నారు.
మూడంచెల భద్రత
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కార్వాన్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. కార్వాన్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపును మాసాబ్‌ట్యాంక్ పాల్‌టెక్నిక్ కాలేజ్‌లో బుధవారం ఉదయం ప్రారంభం అవుతుందని చెప్పారు.
పాలిటెక్నిక్ కాలేజ్‌లో మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో నిషేదాజ్జలు అమల్లో ఉంటాయని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అన్నారు. అనుమతి తీసుకున్న వాహనాలను మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోనే అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు అల్పాహారంతో పాటు భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. పటిష్టమైన బందోబస్తును నిర్వహిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.