హైదరాబాద్

బాద్‌షాలెవరో తేలేది నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నెలకొన్న సస్పెన్స్ నేటితో వీడనుంది. గత నెల 11వ తేదీన జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటరు ఇచ్చిన తీర్పు నేడు బహిర్గతం కానుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల బాద్‌షాలెవరో అనే ఉత్కంఠకు మరి కొన్ని గంటల్లో తెరపడనుంది.
నగరంలోని రెండు పార్లమెంటు స్థానాల పరిధిలోని సుమారు 14 అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను లెక్కించేందుకు 12 కేంద్రాల్లో విస్తత్ర ఏర్పాట్లు చేశారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ర్యాండమైజేషన్‌లో ఎన్నికల సిబ్బంది ఎవరు ఏ నియోజకవర్గంలో విధులు నిర్వర్తించాల్సిన విషయం తేలిపోయినా, గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో మరోసారి నిర్వహించనున్న ర్యాండమైజేషన్‌లో ఎవరు ఏ హాల్‌లో, ఏ టేబుల్‌పై విధులు నిర్వర్తించాలన్న విషయం తేలనుంది. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియకు ఎన్నికల సిబ్బంది మొత్తం ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ సెంటర్లలో రిపోర్టు చేయాలని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు స్థానాల్లో లెక్కింపునకు మొత్తం 528 మంది సిబ్బందిని నియమించగా, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎవరైనా గైర్హాజరైతే వారి స్థానంలో నియమించేందుకు మరో 20 శాతం సిబ్బందిని రిజర్వులో సిద్దంగా ఉంచారు. సిబ్బంది ర్యాండమైజేషన్ తర్వాత వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది స్ట్రాంగ్ రూంలను తెరిచి, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను లెక్కించేందుకు తీసుకురానున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేపట్టారు. అంతేగాక, ప్రతి కేంద్రం వద్ద వంద మీటర్ల ఆవరణలో సెక్షన్ 144 వంటి ఆంక్షలను అమలు చేస్తూ, సభలు, సమావేశాలను నిషేధించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
రెండు స్థానాలు..17లక్షల 86వేల 515 ఓట్లు
నగరంలోని హైదరాబాద్, సికిందరాబాద్ రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం 17 లక్షల 86వేల 515 ఓట్లను గురువారం లెక్కించనున్నారు. సికిందరాబాద్ లోక్‌సభ పరిధిలో 9లక్షల 10వేల 437 ఓట్లు, హైదరాబాద్‌లో పోలైన 8లక్షల 76వేల 78 ఓట్లను లెక్కించేందుకు 12 కేంద్రాలను, ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు. మొట్టమొదటి సారిగా వీవీ ప్యాట్‌లను వినియోగించినందున, వీటిని లెక్కించేందుకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వేసవి ఎండలు మండిపోతున్న కారణంగా ప్రతి కౌంటింగ్ కేంద్రంలో తప్పకుండా కూలర్లను ఏర్పాటుచేసి, విధులు నిర్వర్తించేవారి కోసం తాగునీరు, మజ్జిగా వంటివి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.