హైదరాబాద్

క్షణ క్షణం.. ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలను మహానగరవాసులు ఎంతో ఉత్కంఠతో వీక్షించారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మహానగరవాసులు, రాజకీ పార్టీల నేతలు టీవీలకు అతుక్కుని ఎంతో ఆకస్తిగా ఫలితాలు వీక్షించారు. గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించటం, మరోవైపు వేసవి ఎండలు మండిపోవటంతో నిత్యం రద్దీగా కన్పించే పలు మెయిన్‌రోడ్లు, ప్రధాన కూడళ్లలో రాకపోకలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారాయి. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోవటంతో జనం ఇంటి నుంచి బయటకు రాకుండా ఎన్నికల ఫలితాలు వీక్షిస్తూ కాలక్షేపం చేశారు. నగరంలో పలు హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల్లో ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలను ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రైవేటు సంస్థల్లో కూడా సిబ్బంది కేవలం ఎన్నికల ఫలితాలను వీక్షించేందుకు ఆఫీసులకు వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ఫలితాలను అధికారులు రౌండ్ల వారీగా వెల్లడించటంతో ఏ రౌండ్‌లో ఎవరు ముందున్నారు? ఎవరు వెనుకంజలో ఉన్నారనే విషయాలను తెల్సుకునేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిని చూపారు.
నగరంలోని హైదరాబాద్, సికిందరాబాద్ లోక్‌సభ స్థానాల్లో సికిందరాబాద్ నియోజకవర్గం ఫలితం ఎంతో ఆసక్తికరంగా మారింది. బీజేపీకి ఈ స్థానం సిట్టింగ్ కావటం, ఎగ్జిట్ పోల్ సర్వే అనుకూలంగా రావటంతో కమలనాధుల్లో ధీమా మరింత రెట్టింపయ్యింది. రెండు స్థానాల ఫలితాలు సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర గంటల వరకు తేలిపోయినా, రాష్ట్రంలోని పలు ఇతర నియోజకవర్గాల కౌంటింగ్ రాత్రి వరకు కొనసాగినా, మొత్తం ఫలితాలు వెల్లడయ్యే వరకు వీక్షించటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫలితాలు రావటం పట్ల కొందరు ఆనందాన్ని వ్యక్తం చేయగా, మరికొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించటంతో ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు పలు ప్రాంతాల్లో మిఠాయిలు పంచటం కన్పించింది. ఎన్నికల ఫలితాలపై నగరవాసులు ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సోషల్ మీడియాలో జోరుగా చాటింగ్‌లు చేసుకున్నారు.
ఖైరతాబాద్: దేశ భవిష్యత్‌ను నిర్ధేశించే ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గురువారం నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల ఫలితాలను ఒక్క క్షణం కూడా మిస్ కాకుండా చూసేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరిచారు. నిత్యం రద్దీగా ఉండే అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, చార్మినార్ వంటి ప్రాంతాల వాహనరాకపోకలు లేక రోడ్లు బోసి పోయి దర్శనం ఇచ్చాయి. ఏపీ ప్రజలు అధికంగా నివాసించే కూకట్‌పల్లి ప్రాంతంలో ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, బస్తీ ప్రవేశించే రోడ్లపై సైతం వాహనాలు కనిపించ లేదు. హోరాహోరిగా సాగిన ఏపీ ఫలితాలను తెలుసుకునేందుకు ఆ రాష్ట్రానికి చెందిన ప్రజలతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు సైతం అమిత ఆసక్తి చూపించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఉత్కంఠంగా సాగిన ఏపీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ ఏ దశలోనూ వైసీపీకి ధీటుగా నిలవలేక పోయింది. జగన్ నేతృత్వంలోని వైసీపీకి రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం పెరుగుతుండటంతో ఎస్సార్‌నగర్, అమీర్‌పేట ప్రాంతాల్లోని హాస్టళ్లలో నివసించే వారు సంబరాలు జరుపుకున్నారు. తుది ఫలితాలు వెలువడేంత వరకు టీవీలకే అతుక్కు పోయారు. ఏపీలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంపై హాస్టళ్లు, పార్కులు, మాల్స్ వద్ద చర్చ నిర్వహించారు.
భారీగా మొబైల్ డేటా వినియోగం
ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు నగరంలో నివసించే ఇతర ప్రాంతాలకు చెందినవారు మొబైల్స్‌పై ఆదారపడ్డారు. టీవీలు ఇతరత్ర సౌకర్యాలు లేనివారు లైవ్ అప్‌డేట్‌ను తమ మొబైల్స్ ద్వారా తెలుసుకునేందుకు సాధారణం కంటే అధిక మొత్తంలో మొబైల్ డేటాను వాడుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అయిన మొబైల్స్ వినియోగం సాయంత్రం 6 గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది. వీవీ ప్యాట్ల లెక్కింపుతో ఫలితాలు ఆలస్యం అవుతుండటంతో స్పష్టమైన ఆధిక్యం తెలుసుకునేంత వరకు మొబైల్స్‌ను వీడలేదు. ఈ పరిస్థితి హాస్టళ్లు అధికంగా ఉండే ఎస్సార్‌నగర్, అమీర్‌పేట ప్రాంతాల్లో కనిపించింది.
సోషల్ మీడియాలో సెటైర్లు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొట్టాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ విజయంతో అనుకూలంగా రూపొందించిన కార్టున్లు వందల్లో పోస్టులు పెట్టారు. వాటిని సమర్థిస్తూ మరికొంత మంది రీపోస్టులతో వాట్సాప్ గ్రూప్‌లు నిండిపోయాయి. చంద్రబాబు ఓటమికి కారణాలను విశే్లషిస్తూ కొందరు పొస్టులు పెట్టగా వాటిని హాస్యంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అద్భుతమైన ఎమోజీలను జోడించి నెటిజన్లు బాబు బాయ్ బాయ్ అంటూ, కవితక్క ఇక సెలవుతీసుకో అంటూ వేసిన పోస్టులు నవ్వులు పూయించాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనంపై సైతం నెటిజన్లు ప్రత్యేక వీడియోలను రూపొందించి పోస్ట్ చేశారు. బీజేపీ గెలుపు స్వాగతిస్తూ గ్రూప్‌లో అనుకూలంగా రూపొందించిన కార్టున్ల, వీడియోలను పోస్ట్ చేయగా, వాటికి లైక్‌లు, షేర్‌లు అధికంగా వచ్చాయి.