హైదరాబాద్

సిట్టింగ్ స్థానాలు పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అతి కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నగరంలో ఉత్కంఠ భరితంగా సాగింది. నగరంలోని హైదరాబాద్, సికిందరాబాద్ లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్ పార్టీలు సీట్లను నిలబెట్టుకున్నాయి.
హైదరాబాద్ నియోజకవర్గంలో మళ్లీ పతంగ్ హవా కొనసాగగా, సికిందరాబాద్‌లో అభ్యర్థి మారినా, కమలం వికసించి, పట్టు నిలబెట్టుకుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ రెండు లోక్‌సభ స్థానాల నియోజకవర్గంలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రక్రియ మొదలైంది. మొదటి రౌండ్ మొదలుకుని మధ్యాహ్నం వరకు సికిందరాబాద్‌లో బీజేపీ ఆధిక్యంతోనే కొనసాగుతూ వచ్చి, చివరకు ఆ పార్టీ అభ్యర్థి జీ.కిషన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అధికార టీఆర్‌ఎస్‌కి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌పై 51801 ఓట్లతో ఆధిక్యతతో గెలుపొందినట్లు ప్రకటించారు. హైదరాబాద్ నియోజకవర్గంలోనూ కౌంటింగ్ క్షణ క్షణం ఉత్కంఠభరితంగా సాగింది. గతంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన పోటీ మజ్లిస్, బీజేపీ మధ్యనే కొనసాగుతుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఫిరోజ్‌ఖాన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవటంతో పోటీ కాస్త రసవత్తరంగా మారింది. మజ్లిస్ నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీతో పాటు కాంగ్రెస్ నుంచి మైనారిటీ అభ్యర్థి బరిలో నిలవటంతో ఇద్దరు మైనారిటీలు పోటీలో ఉండటంతో ఓట్లు చీలి బీజేపీకి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందని ఆ పార్టీ వర్గాలు భావించాయి.
ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను ఏడు కేంద్రాల్లో లెక్కించారు. 5వ రౌండ్‌కు చేరే సరికి మజ్లిస్‌కి లక్షా 6815 ఓట్లు, బీజేపీకి 80971 ఓట్లు లభించాయి. 15వ రౌండ్‌కు చేరుకునే సరికి మజ్లిస్‌కి 39292 ఓట్లు, బీజేపీకి 213384, 17వ రౌండ్‌కు చేరుకునే సరికి మజ్లిస్‌కు 414917 ఓట్లు, బీజేపీకి 220698 ఓట్లు, 20వ రౌండ్‌లో మజ్లిస్‌కు 49491, బీజేపీకి 243319 ఓట్లు లభించాయి. మజ్లిస్ అభ్యర్థి అసదుద్దిన్ ఓవైసీ తమ సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భగవంత్ రావుపై 2లక్షల 16వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపు సాధించినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని రెండు స్థానాల్లోనూ హస్తం మూడో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.
‘తల’కిందులైన అంచనాలు
సికిందరాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్న టీఆర్‌ఎస్ మంత్రులు, నేతల అంచనాలు తలకిందులయ్యాయి. వారి అత్యుత్సాహామే ఓటమికి కారణమైందనే వాదనలు ఉన్నాయి. ఈ పార్టీ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ మొట్టమొదటి సారిగా పోటీలో చేయటం, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిలో టీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నా, అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునే తరహాలో ప్రచారం నిర్వహించకపోవటమే ఓటమికి కారణమని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీకి సిట్టింగ్ స్థానమైన సికిందరాబాద్ నుంచి ఎంపీగా కిషన్ రెడ్డి మొదటిసారిగా పోటీ చేసినా, పార్టీకున్న ఓటు బ్యాంక్‌ను ప్రసన్నం చేసుకున్నందునే విజయం సాధించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.