హైదరాబాద్

మల్కాజిగిరిలో రేవంత్.. చేవెళ్లలో రంజిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెరాస తన చేవెళ్ళ స్థానాన్ని పదిలం చేసుకోగా, మల్కాజిగిరి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవశం చేసుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగిన తీరు నువ్వా నేనా అన్న చందంగా ప్రక్రియ ముగిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం నుండి కేసీఆర్ వెంట నిలిచి చేవెళ్ళ పార్లమెంటు స్థానానికి పోటీచేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించిన కొండా విశే్వశ్వరరెడ్డి ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుండి పోటీచేసినా విజయం సాధించలేకపోయారు. ఈ నియోజకవర్గంలో తిరిగి ఆయనే విజయం సాధిస్తారనే విశ్వాసాన్ని ప్రదర్శించినా చివరి నిమిషంలో రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలు ఆయనను దెబ్బతీసాయి. 21 రౌండ్ల వరకు సుమారు 20వేల మెజార్టీతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత క్రమంగా మెజార్టీ తగ్గుతూ టీఆర్‌ఎస్ కంటే వెనుకపడిపోయింది. చివరకు సుమారు 14,400 ఓట్ల మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి విజయం సాధించారు. గ్రామీణ ప్రాంతాల్లో విశే్వశ్వరరెడ్డి ఆధిక్యత సాధించినా పట్టణ ప్రాంతంలోని ఓటర్లు తెరాస వైపు మొగ్గు చూపడంతో ఓటమిని చవిచూశారు.
ఈ ఎన్నికల్లో మహేశ్వరం, రాజేంద్రనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎంఐఎం అధినేత అససుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్‌ఎస్‌లో చేరిన యువ నాయకుడు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పర్యటించి మైనార్టీల ఓట్లను ఒకవైపే వేయించడంలో సఫలీకృతం కావడమే టీఆర్‌ఎస్ విజయానికి కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అలాగే మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి 2014లో టీడీపీ నుండి పోటీ చేసిన విజయం సాధించిన ప్రస్తుత మంత్రి చామకూర మల్లారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన అనంతరం ఈ ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించడం తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో తనకు బదులుగా తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డికి టీఆర్‌ఎస్ పార్టీ నుండి టిక్కెట్ ఇప్పించి బరిలోకి దించారు. అధికారంలో ఉన్న కారణంగా మంత్రిగా అన్ని పనులు తానే చేస్తానంటూ అభయమిచ్చినా ఓటర్లు మాత్రం ఆయన మాటను నమ్మలేదు. అలాగే ఘట్‌కేశర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని తెరాస నాయకులు సైతం మంత్రి వైఖరి కారణంగా పార్లమెంటు ఎన్నికల్లో సక్రమంగా పనిచేయలేదని ఆరోపణలు పార్టీ వర్గాల్లో వినిపించాయి. ఆ ఆరోపణలే నిజమైనట్టుగా రాజకీయ పరిశీలకులు ఈ ఎన్నికల ఫలితాల అనంతరం భావిస్తున్నారు. ప్రధానంగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేవంత్‌రెడ్డికి సుమారు 29వేల ఓట్ల మెజార్టీ లభించగా మేడ్చల్‌లో 8వేలు, మల్కాజిగిరిలో సుమారు నాలుగు వేల ఓట్ల మెజార్టీ వచ్చిందంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పడం వెనుక కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు సైతం పరోక్షంగా రేవంత్‌రెడ్డికి అనుకూలంగా పనిచేశారన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యత సాధించినా ఫలితం లేకపోయింది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగిన ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సుమారు 10,700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించండంతో పార్టీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రశ్నించే గొంతు అంటూ రేవంత్‌రెడ్డికి కొటేషన్స్‌తో చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు విజయాన్ని చేకూర్చింది.