హైదరాబాద్

30న విశ్వకర్మ లెజెండరీ అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, : విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి విశ్మకర్మ లెజెండరి అవార్డులను ఈనెల 30 అందిస్తున్నట్టు సెంటర్ చైర్‌పర్సన్ శకుంతల తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, వెంకట నారాయణ, ద్రోణాచారిలతో కలిసి ఆవిష్కరించారు. మాట్లాడుతూ సమాజ సేవ చేస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహించే నిమిత్తం ఈనెల 30 రవీంద్రభారతిలో అవార్డులను అందిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీశ్రీశ్రీ శివాత్మనంద, మాజీ సభాపతి మధుసూదనాచారి, కేంద్ర బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, ఏఐసీసీ కార్యదర్శి దాసోజు శ్రవణ్, ప్రెస్‌క్లబ్ కార్యదర్శి రాజవౌళి చారి హాజరు అవుతారని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజల ఆదరణ
ఖైరతాబాద్, మే 25: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రజల ఆదరణతో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ అత్యధిక సీట్లను కైవసం చేసుకుందని సినీనటుడు, వైసీపీ నేత పృథ్వి అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నటుడు కృష్ణుడితో కలిసి మాట్లాడారు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన నాడే జగన్ గెలుపు ఖాయం అయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబం జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా అనుకునేలా పాదయాత్ర కొనసాగిందని అన్నారు.